కొంత కాలంగా బుల్లితెరపై గేమ్ షోల హవా పెరిగింది. సీరియళ్లకు ధీటుగా గేమ్ షోలు కండక్ట్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇలాంటి ప్రోగ్రామ్ లలో మాంచి క్రేజ్ ఉన్న షో ‘క్యాష్’. ఈ షోకు రేటింగ్ కూడా బాగానే వస్తోంది. అయితే.. ఈ షోకు సంబంధించి చాలా మందికి పలు సందేహాలు ఉన్నాయి. ఈ షో మాత్రమే కాదు.. ఈ తరహా క్యాష్ ప్రోగ్రామ్స్ అన్నింటిపైనా డౌట్స్ ఉన్నాయి. కంటిస్టెంట్లకు ఇచ్చే డబ్బులు మొదలు.. క్యాష్ షోలో చివర్లో ధ్వంసమయ్యే వస్తువులకు వరకూ అన్నీ నిజమేనా? అనే డౌట్స్ ఆడియన్స్ లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం.
Also Read: 50 ఏళ్ల వయసులో బిడ్డను కన్న స్టార్ హీరోయిన్
ముందుగా.. ఏ షోలోనైనా చూసేవన్నీ నిజాలు కావు.. అదే సమయంలో అన్నీ అబద్దాలు కూడా కావు. కొంత వాస్తవం.. మరికొంత కల్పితం ఉంటుంది. మొదటి విషయం ఏమంటే.. అన్ని ప్రోగ్రామ్స్ కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంటాయి. అంటే.. ఎవరు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలు మొదలు.. ప్రోగ్రాం మొత్తం స్క్రిప్ట్ ప్రకారం కంటిన్యూ అవుతుంది.
ఇక, పలు షోస్ కు సెలబ్రిటీస్ వచ్చి గేమ్ ఆడుతుంటారు. ఈ క్రమంలో వాళ్లు లక్షలు, వేలు గెలుచుకున్నారని ప్రైజ్ మనీ ఇస్తుంటారు. అది మాత్రం నిజం కాదు. కేవలం పబ్లిసిటీ కోసమే అలా చేస్తారు. అంతేకాదు.. సెలబ్రిటీలు వచ్చే షోలలో.. వారే ఛానల్ కు డబ్బులు ఇస్తుంటారు. వాళ్ల రేంజ్‌ను బట్టి ఒక్కొక్కరికి ఎపిసోడ్‌కు 5 నుంచి 20 వేల వరకు కూడా చెల్లిస్తుంటారు. ఎందుకంటే.. ఈ షోల ద్వారా వాళ్ల పాపులారిటీ పెరుగుతుది కాబట్టి.
ఇక, చాలా షోలలో ఆడియన్స్ గా స్టూడెంట్స్ వస్తుంటారు. పార్టిసిపెంట్లుగా కూడా వస్తుంటారు. వీళ్లకు లెక్క వేరే ఉంటుంది. వీళ్లకు టీవీ ఛానల్స్ డబ్బులు ఏమీ చెల్లించవుగానీ.. భోజనాలు మాత్రం ఏర్పాటు చేస్తుంటారు. గతంలో జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చే వాళ్లు. వాళ్లు మాత్రం రోజుకు రూ.500 నుంచి 750 వరకు ఇచ్చేవాళ్లు. వారితో ఒకేరోజు మూడు నాలుగు ఎపిసోడ్స్ షూట్ చేసేవాళ్లు. కానీ.. ఇప్పుడు స్టూడెంట్స్ వస్తుండడంతో ఛానళ్లకు డబ్బు ఖర్చు లేకుండాపోయింది.
Also Read: థియేటర్లో ‘ఆ నలుగురు!’.. మరి, దమ్ము చూపిందెవరో తెలుసా..?
ఇక మరికొన్ని గేమ్ షోలు ఉంటాయి. వీటిలో కామన్ ఆడియన్సే ఉంటారు. ఇందులోని వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వరు.. ఈ షోవల్ల అందరికీ తెలుస్తుంటారు. అయితే.. వాళ్లు గెలుచుకున్న గిఫ్టులు మాత్రం వాళ్లకే ఇస్తుంటారు. ఇక, ఢీ లాంటి షోలలో మాత్రం విజేతలకు ఇచ్చే డబ్బులు నిజమే. కానీ.. వాళ్లు లక్ష గెలిస్తే.. అందులో 40 శాతం ట్యాక్స్ రూపంలో కట్ చేసుకుంటారు.
ఇక క్యాష్ ప్రోగ్రాంలో చివరలో పగిలిపోయే సామాన్లు నిజమేనా అంటే.. అందులో కొంత వాస్తవం ఉంది. అక్కడ ధ్వంసం చేయడానికి ఉంచిన సామాను పాతదే. అంటే.. పనికిరాని వస్తువులనే అక్కడ ఉంచుతారు. వాటి విలువ మొత్తం 10 వేల లోపే ఉంటుంది. అలాంటి వాటినే అక్కడ ఉంచి కింద పడేస్తుంటారు. ఈ విధంగా పలు గేమ్ షోలలో వాటికి ప్రత్యేకమైన స్క్రిప్టు ఉంటుంది. ఆ ప్రకారమే వాటిని రన్ చేస్తుంటారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్