కరోనా కల్లోలంతో రాజకీయాలకు తెరపడింది. ప్రజల ఆరోగ్యంపైనే దృష్టిసారించాల్సిన పరిస్థితులు దాపురించాయి. అయితే లాక్ డౌన్ తో కేసులు తగ్గుతున్న వేళ తాజాగా సీఎం జగన్ పార్టీ గెలిచినప్పటి నుంచి పదవుల కోసం వేచిచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. కులానికో కార్పొరేషన్లు ప్రకటించి దాదాపు 50 కార్పొరేషన్లు పెట్టించిన జగన్ ఇప్పుడు వాటికి చైర్మన్ ల పదవులను భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఏపీలో కులాల ఆధిపత్యం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏ పని చేయాలన్నా కుల ప్రాతిపదికనే కొనసాగిస్తున్నారు. ఎవరికైనా కులమే బలంగా కనిపిస్తోంది. అందుకే ఏపీలో రెడ్డి, కమ్మ, క్షత్రియ ఇలా అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి ఓట్లు ఎటూ పోకుండా సీఎం జగన్ పాచికలు వేస్తున్నారు. కార్పొరేషన్లతో వారికి ఒరిగేదేమీ లేకున్నా పదవుల ఆశ చూపి ఆకర్షిస్తున్నారు. ఖాళీగా ఉన్న అసంతృప్త నేతలను గురిపెట్టి తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఫలానా వారికి ఇది ఇస్తున్నామని చెబుతూ నేతల్లో ఆశలు నింపుతున్నారు.
ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక సామాజిక కోణంలో అన్ని కులాల వారికి పెద్ద పీట వేస్తూ రాష్ర్టంలో రెడ్డి కులం వారిని పట్టించుకోవడం లేదని వారికి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. వారి జీవన విధానంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం చేసి జీవించే రెడ్డు పరిస్థితులు కలిసి రాక అనేక నష్టాలు అనుభవిస్తున్నారని వారంతా గగ్గోలుపెడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందుకోసం నిధులు కేటాయించి వారిలో ఆత్మస్థైర్యం నింపడమే ప్రధాన ధ్యేయంగా పేర్కొన్నారు. అడపాదడపా వచ్చే పంటలతో వారికి ప్రయోజనం కలగడం లేదని వాపోయారు. అందుకే రెడ్డి సామాజిక వర్గానికి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకోవడానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నారు.
కమ్మ సామాజిక వర్గం కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వ్యవసాయం, వ్యాపారం ప్రధాన వృత్తిగా చేసుకున్న కమ్మలు సైతం జీవన గమనంలో కష్టాలతోనే సహవాసం చేస్తున్నారు. అందుకే వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. దీంతో వారిలోని ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ప్రధాన భూమిక పోషించాలని భావిస్తోంది. కమ్మల్లో ఆర్థిక పరిపుష్టి సాధించి వారిలో ధైర్యం నింపడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నారు. అందుకే కమ్మ సామాజిక వర్గానికి స్వతంత్ర ఆర్థిక ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు.
క్షత్రియ సామాజిక వర్గం కోసం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. క్షత్రియులు తమ పిల్లల ఉన్నత విద్య కోసం చాలా కష్టపడుతున్నారని గుర్తించింది. వారిలో ఉన్న ఆర్థిక అసమానతలను రూపుమాపే క్రమంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ ఉండాలని భావించింది. అందుకే క్షత్రియ సామాజిక వర్గ ప్రయోజనాలే లక్ష్యంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దీంతో వీరిలో ఉన్న కష్టాలు, నష్టాలకు చక్ పెట్టేందుకు ప్రధాన భూమిక పోషించేందుకు ఉద్దేశించినట్తు తెలుస్తోంది.
రెడ్డి, కమ్మ, క్షత్రియ సామాజిక వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం పదవులు మాత్రం ఇస్తోంది. దీంతో చైర్మన్, డైరెక్టర్ల పదవుల కోసం అధికార పార్టీ నేతలు ప్రదక్షిణలు చే్స్తున్నారు. ఇదే అదనుగా తమ వారి కోసం పలు ప్రత్యేక ఆకర్షణ పథకాలు ఇస్తున్నట్లు పదేపదే చెబుతున్నారు.
తాజాగా రాష్ట్రంలో అధికారాన్ని అనుభించే రెండు కీలక సామాజికవర్గాలైన కమ్మ, రెడ్ల కార్పొరేషన్లకు జగన్ కీలక వ్యక్తులను చైర్మన్లుగా ఖరారు చేసినట్టు సమాచారం. ఈ మేరకు అమరావతి నుంచి వార్తలు వస్తున్నాయి. కమ్మ కార్పొరేషన్ కు విజయవాడ పరిధిలోని సీటులో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బొప్పన భవ కుమార్ ను చైర్మన్ గా ఎంపిక చేసినట్టు సమాచారం.ఇక రెడ్డి కార్పొరేషన్ కు గిద్దలూరుకు చెందిన కామురు రమణరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు తెలిసింది.
ఇలా రాష్ట్రంలోని బలమైన కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకు జగన్ చైర్మన్లుగా భవ కుమార్, రమణారెడ్డిలను ఖరారు చేసినట్టు ప్రచారం సాగుతోంది. రేపోమాపో వీరి నియామకాన్ని అధికారికంగా బయటపెట్టవచ్చని అంటున్నారు.