CM Jagan: సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు రిజిస్రీ తిరస్కరించింది. ఎంపీ రఘురామ గతంలోనే జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. మరోవైపు జగన్, సాయిరెడ్డి తరఫు న్యాయవాదులు సైతం రాజకీయ దురుద్దేశంతోనే తమపై బెయిల్ రద్దు పిటిషన్లు దాఖలు చేసినట్లు వాదనలు వినిపించారు.

జగన్(CM Jagan), విజయసాయిరెడ్డిలపై వేసిన పిటిషన్లు ఒకే తీరుగా ఉండడంతో వీటికి కలిపి ఒకేసారి తీర్పు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్లు మరో బెంచ్ కు మార్చాలని కోరారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రఘురామ పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు తిరస్కరించింది. దీనిపై హైకోర్టుకు వెళ్తానని రఘురామ చెప్పిన సంగతి తెలిసిందే.
ఎంపీ రఘురామ జగన్, విజయసాయిరెడ్డిలపై పలు ఆరోపణలు చేస్తున్నారు. వారిద్దరు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వాపోయారు. సీబీఐ దాఖలు చేసిన చార్జీషీటులో ఉన్న వారికి పదవులు ఇస్తున్నారని పేర్కొంటున్నారు. వారు చేస్తున్న దురాగాతాలకు సీబీఐ ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదని చెబుతున్నారు. వీటన్నింటిని హైకోర్టు రిజిస్రీ తిరస్కరించింది. రఘురామ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామ వేసిన పిటిషన్లలో సాంకేతిక అంశాలు సరిగా లేవని తెలుస్తోంది. మరో వైపు పూర్తి వివరాలు కూడా పొందుపరచలేదని హైకోర్టు వాదిస్తోంది. దీంతో రఘురామ లేవనెత్తిన అభ్యంతరాలపై ఆయన మరోసారి పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఈ కేసు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం వైసీపీ నేతలు కూడా రఘురామ వ్యాఖ్యలపై స్పందించడం లేదు.