Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అందుకు గల కారణం ఆమె నాగచైతన్య నుంచి విడాకులు తీసుకోవడమే.అయితే అక్టోబర్ 2వ తేదీ వీరి విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించిన తరువాత మొట్టమొదటిసారిగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక భావోద్వేగమైన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్టోబర్ 8వ తేదీ జరిగే
లాక్‌మీ ఫ్యాషన్ షో ప్రమోషన్ లో భాగంగా ఈ పోస్ట్ షేర్ చేశారు.

ఈ క్రమంలోనే సమంత ఫోటో షేర్ చేయడంతో పాటు ఇలా రాసుకొచ్చింది. ఈ క్యాప్షన్ లో మాత్రం మరేదో అర్థం దాగి ఉందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే సమంత ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఫోటోలు వైట్ కలర్ డ్రెస్ ధరించి పింక్ అండ్ వైట్ రోజెస్ పెట్టుకొని కిందకి చూస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో షేర్ చేస్తూ సమంత ఈ విధంగా రాసుకొచ్చారు.
View this post on Instagram
పాత ప్రేమ పాటలు ..పర్వతాలు.. శిఖరంపై వీచే శీతాకాలపు గాలి ధ్వని, పోగొట్టుకున్న పాత చిత్రాలలో ప్రేమ పాటలు దొరికినప్పుడు లోపల బాధను ప్రతిధ్వనించే ఆ ప్రేమ పాటలు ..పాత బంగ్లాలు.. మెట్ల మార్గాలు.. గాలి శబ్దం అంటూ .. రాసుకొచ్చారు. అయితే ఇది ఫ్యాషన్ షో కోసం అయినప్పటికీ సమంత తనలో ఉన్న భావోద్వేగాన్ని ఈ విధంగా తెలియజేశారని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే అక్టోబర్ 7 సమంత నాగ చైతన్యల వివాహ వార్షికోత్సవం కావడంతో తను ఎమోషనల్ అయిందని, అన్ని సక్రమంగా ఉంటే ఈ రోజు వారు నాలుగవ వివాహ వార్షికోత్సవదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకునేవారని తెలుస్తోంది.