https://oktelugu.com/

వంట నేర్చుకుంటున్న స్టార్ హీరో !

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కొన్ని నెలలుగా సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో, హీరోలు ఫుల్ రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. పైగా సినిమాలకు సంబందించి జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రీ ప్రొడక్షన్ పనులతో కూడా హీరోలకి పెద్దగా సంబంధం లేకపోవడంతో, అందరీ హీరోలూ.. తమ ఫ్యామిలీస్ తోనే ఫుల్ టైం గడిపేస్తున్నారు. షూటింగ్ లతో తరచూ బిజీగా గడిపే హీరో హీరోయిన్లు, నటీనటులంతా ఇప్పుడు వంట గదిలో తమ కుటుంబ సభ్యుల కోసం […]

Written By:
  • admin
  • , Updated On : July 6, 2020 / 03:25 PM IST
    Follow us on


    కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కొన్ని నెలలుగా సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో, హీరోలు ఫుల్ రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. పైగా సినిమాలకు సంబందించి జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రీ ప్రొడక్షన్ పనులతో కూడా హీరోలకి పెద్దగా సంబంధం లేకపోవడంతో, అందరీ హీరోలూ.. తమ ఫ్యామిలీస్ తోనే ఫుల్ టైం గడిపేస్తున్నారు. షూటింగ్ లతో తరచూ బిజీగా గడిపే హీరో హీరోయిన్లు, నటీనటులంతా ఇప్పుడు వంట గదిలో తమ కుటుంబ సభ్యుల కోసం కుస్తీ పడుతున్నారట.

    ఇళ్ల స్థలాల పంపిణీకి వాయిదాకు కారణం ఇదేనా..!

    టాలీవుడ్ లో ఆ మధ్య ‘బీ ది రియల్ మాన్ ఛాలెంజ్’ పేరుతో కొనసాగిన దానిలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోలు దర్శకులు అందరూ కూడా ఇల్లు ఊడుస్తూ వంట చేస్తూ కనిపించిన విజువల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే ఏదో పేరు కోసం చేసినట్టు కాకుండా నిజంగానే ఒక హీరో వంట నేర్చుకుంటున్నాడు. కరోనాతో దొరికిన తీరిక వేళను రామ్ వంటింట్లోకి దూరి సరదగా గరిటె పట్టి వంట నేర్చుకుంటున్నాడట.

    తొలి వాక్సిన్ భారత్ నుంచే రానుందా?

    ఇప్పటికే రామ్ చరణ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఖాళీ సమయాల్లో వంటింట్లోకి దూరి సరదగా గరిటె పట్టి వంట చేస్తుంటారని.. గతంలో వాళ్లే చెప్పారు. పైగా వాళ్ళు వంట చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఆ మధ్య హల్ చల్ చేశాయి. ప్రస్తుతం రామ్ వంతు వచ్చింది.