https://oktelugu.com/

TS Teachers Promotion: ఉపాధ్యాయుల పదోన్నతులకు సీఎం గ్రీన్ సిగ్నల్

TS Teachers Promotion: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎవరికి అర్థం కారు. తాను అనుకున్నది చేయడంలో దిట్ట. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాననున్నది చేయడంలో ఆయనకు ఆయనే సాటి. రాష్ర్టంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు నిలిచిపోయిన సందర్భంలో వారు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో సీఎం కేసీఆర్ కు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మొర ఆలకించారో ఏమో కానీ వారికి శుభవార్త చెబుతున్నారు. త్వరలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపడతామని […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 8, 2022 / 06:06 PM IST

    CM KCR

    Follow us on

    TS Teachers Promotion: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎవరికి అర్థం కారు. తాను అనుకున్నది చేయడంలో దిట్ట. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాననున్నది చేయడంలో ఆయనకు ఆయనే సాటి. రాష్ర్టంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు నిలిచిపోయిన సందర్భంలో వారు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో సీఎం కేసీఆర్ కు మొరపెట్టుకున్నారు.

    CM KCR

    ఈ నేపథ్యంలో వారి మొర ఆలకించారో ఏమో కానీ వారికి శుభవార్త చెబుతున్నారు. త్వరలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపడతామని ప్రకటించారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో కూడా వారికి ఇంక్రిమెంట్లు ఇచ్చి సంబరాలు జరుపుకునేలా చేసిన కేసీఆర్ మరోమారు వారి పాలిట దేవుడయ్యారు.

    పెండింగులో ఉన్న పదోన్నతులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రిని కోరారు. అలాగే సీఎస్ సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు చెందిన ఫైళ్లు అన్ని తీసుకురావాలని సూచించారు. దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తూ వచ్చిన సమస్య కొలిక్కి రావడంతో ఇక సమస్య తీరినట్లేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    KCR

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఎన్నో రోజులుగా ప్రమోషన్ల గురించి విన్నవిస్తున్నా నెరవేరలేదు. ఈ సారి మాత్రం త్వరగా స్పందించి ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

    Tags