https://oktelugu.com/

Prabhas Marriage Date: ప్రభాస్ పెళ్లి తేదీ అదే.. క్లారిటీ ఇచ్చిన ప్రముఖ వ్యక్తి

Prabhas Marriage Date: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. పైగా ప్రభాస్ ఇప్పుడు వరుస పాన్‌ ఇండియా సినిమాల హీరో. ప్రభాస్ చేస్తున్న సినిమాల బడ్జెట్‌ లెక్క వేస్తే.. రూ.1000 కోట్లకు పైమాటే ఉంటుంది. మరి వేయి కోట్ల హీరో పెళ్లి పై సహజంగానే ఆసక్తి ఉంటుంది. కాగా ఈ ఇంట్రెస్టింగ్ విషయం పై ప్రముఖ జ్యోతిషుడు ఆచార్య వినోద్‌ కుమార్‌ క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ కి పెళ్లి ఎప్పుడు […]

Written By:
  • Shiva
  • , Updated On : March 8, 2022 / 06:00 PM IST

    Prabhas Fans

    Follow us on

    Prabhas Marriage Date: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. పైగా ప్రభాస్ ఇప్పుడు వరుస పాన్‌ ఇండియా సినిమాల హీరో. ప్రభాస్ చేస్తున్న సినిమాల బడ్జెట్‌ లెక్క వేస్తే.. రూ.1000 కోట్లకు పైమాటే ఉంటుంది. మరి వేయి కోట్ల హీరో పెళ్లి పై సహజంగానే ఆసక్తి ఉంటుంది. కాగా ఈ ఇంట్రెస్టింగ్ విషయం పై ప్రముఖ జ్యోతిషుడు ఆచార్య వినోద్‌ కుమార్‌ క్లారిటీ ఇచ్చాడు.

    Prabhas Marriage Date

    ప్రభాస్ కి పెళ్లి ఎప్పుడు అవుతుందో చెబుతూ.. ప్రభాస్‌ కి ఈ ఏడాది పెళ్లి అయిపోతుంది అని ఆచార్య వినోద్‌ కుమార్‌ బల్లగుద్ది మరీ చెప్పాడు. ఆయన మాటల్లోనే “హీరో ప్రభాస్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది అక్టోబరు నుంచి వచ్చే ఏడాది అక్టోబరు మధ్యలో ప్రభాస్ పెళ్లి ఎప్పుడైనా జరగొచ్చు. నేను చెప్పింది నిజం.. మన పాన్‌ ఇండియా స్టార్‌ విషయంలో నా జ్యోతిష్యం నిజం అవుతుంది’ అంటూ ఆచార్య వినోద్‌ కుమార్‌ స్పష్టం చేశాడు.

    మరి వినోద్‌ కుమార్‌ చెప్పినట్లే ప్రభాస్‌ పెళ్లి నిజంగానే ఆయన చెప్పిన తేదీల మధ్యలో జరుగుతుందా ? చూడాలి, అయితే రాధేశ్యామ్‌ ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ జర్నలిస్ట్ ప్రభాస్‌ ను ‘ ట్రైలర్‌ 2 లో ప్రేమ గురించి ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు అనే డైలాగ్ ఉంది. అయితే మీ రియల్ లైఫ్‌లో కూడా అలా ఎప్పుడైనా ప్రిడిక్షన్ తప్పు అయ్యిందా` అని అడిగారు.

    Prabhas Marriage Date

    అందుకు ప్రభాస్ సమాధానమిస్తూ.. ‘చాలాసార్లు అయ్యింది. అందుకే నాకింకా పెళ్లి కాలేదు` అంటూ సమాధానం ఇచ్చారు. మొత్తానికి టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ తన పెండ్లి గురించి ఇలా స్పందించడం ఆసక్తిని కలిగించింది. అయితే, తన రియల్ లైఫ్‌ లో కూడా ప్రేమ విషయంలో చాలాసార్లు ప్రిడిక్షన్ తప్పు అయ్యిందని ప్రభాస్ చెప్పడం, పైగా అందుకే నాకింకా పెళ్లి కాలేదు అని క్లారిటీ ఇవ్వడం ఒకవిధంగా షాకింగ్ విషయమే.

    గతంలో ప్రభాస్ అనుష్కతో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. మరి ఆ ప్రేమ మధ్యలో ఆగిపోయిందో.. లేక మరో సీక్రెట్ ప్రేమ విషయంలో ప్రభాస్ లవ్ ఫెయిల్ అయ్యాడో తెలియదు గానీ, మొత్తానికి ప్రభాస్ కి కూడా లవ్ ఫెయిల్యూర్ ఉంది అని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు.

    Tags