జస్టిస్ ఎన్వీ రమణ సంచలన నిర్ణయం?

న్యాయవ్యవస్థకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన నిర్ణయం తీసుకున్నాా? పెండింగ్ కేసులు పెరగడానికి ప్రధాన కారణమైన న్యాయమూర్తుల కొరతకు ఆ నిర్ణయం పరిష్కారం కానుందా? జడ్జి నియామకాలకు సంబంధించి కొలీజియం పరిధి విస్తృతం కానుందా? అంటే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అవుననే సమాధానం చెబుతోంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 25 హైకోర్టుల్లో న్యాయమూర్తుల కొరత నెలకొని ఉండడం, మాజీ సీజేఐ ఎస్ఏ బోబ్డే తన 14 […]

Written By: NARESH, Updated On : June 9, 2021 9:12 am
Follow us on

న్యాయవ్యవస్థకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన నిర్ణయం తీసుకున్నాా? పెండింగ్ కేసులు పెరగడానికి ప్రధాన కారణమైన న్యాయమూర్తుల కొరతకు ఆ నిర్ణయం పరిష్కారం కానుందా? జడ్జి నియామకాలకు సంబంధించి కొలీజియం పరిధి విస్తృతం కానుందా? అంటే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అవుననే సమాధానం చెబుతోంది.

అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 25 హైకోర్టుల్లో న్యాయమూర్తుల కొరత నెలకొని ఉండడం, మాజీ సీజేఐ ఎస్ఏ బోబ్డే తన 14 నెలల పదవీ కాలంలో ఒక్కటంటే ఒక్క నియామకాన్ని కూడా చేపట్టకపోవడం, భారీ ఎత్తున జడ్జిల నియామకాలు చేపట్టాల్సిన భారం ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణపై ఉండడం తెలిసిందే. ఈక్రమంలోనే ఓ సరికొత్త ప్రతిపాదన సీజేఐ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులుగా కొనసాగుతున్న వారిలో అర్హలైన కొందరికి రాష్ర్టాల హైకోర్టుల్లో జడ్జిలుగా ఎలివేషన్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు సీజేఐ అంగీకరించారని సుప్రీంకోర్టు బార్ అసోసియేసన్ పేర్కొంది.

సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లుగా కొనసాగుతున్న వారిలో కొందరికి సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, వాణిజ్య చట్టాలపై మంచి పట్టుందని, న్యాయవ్యవస్థలో వారికున్న సుదీర్ఘ అనుభవంతో తీర్పులివ్వగలిగే సత్తా ఉందని, అలాంటి వారికి హైకోర్టుల్లో జడ్జిలుగా ఎలివేషన్ ఇవ్వాలనే ప్రతిపాదనను సీజేఐ రమణ ముందు ఉంచగా అందుకాయన అంగీకారం తెలిపాు. ఈ మేరకు హైకోర్టు జడ్జిలుగా సుప్రీం లాయర్ల ఎలివేషన్ అమలయ్యేలా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సీజేఐ సూచనలతో కూడిన వినతి చేసేందుకు అంగీకరించారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడైన వికాస్ సింగ్ ఆ బార్ ఎగ్జిక్యూటివ్ సభ్యులకు మే 31న సమాచారం చేరవేశారు.

సుప్రీంకోర్టులోని సీనియర్ అడ్వకేట్లను రాష్ర్టాల హైకోర్టులో జడ్జిలుగా ఎలివేషన్ కల్పించే ప్రతిపాదనకు సీజేఐ రమణ అంగీకరించారని, దీనిపై హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు ఆయన కమ్యూనికేట్ చేస్తారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చేసిన ప్రకటపై సీజేఐ కార్యాలయం భిన్నంగా స్పందించింది. సదరు ప్రతిపాదన జస్టిస్ రమణ వద్దకు చేరిన మాట వాస్తవమే. ఈ విషయమై బార్ అసోసియేషన్ ప్రతినిధులు సీజేఐ కలిశారని, అయితే దీనిపై జస్టిస్ రమణ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీజేఐ కార్యాలయం తెలిపింది.