https://oktelugu.com/

1962 దొంగ దెబ్బ మళ్ళీ తగలనుందా?

గాల్వాన్ లోయ ఘటన తరువాత భారత్ చైనా దేశాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.  ఇటీవలే ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.  ఈ చర్చల్లో కొంతమేర ఫలితం కనిపించింది.  చైనా మూడు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్ళగా, భారత్ బలగాలు 1.5 కిలోమీటర్ల మేర వెనక్కి వచ్చాయి.  అయితే, చైనాను నమ్మడానికి వీలు లేదని నిపుణులు అంటున్నారు.  జూన్ 6 వ తేదీన ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగినప్పటికీ, జూన్ 15 వ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 8, 2020 7:08 pm
    Follow us on

    China
    గాల్వాన్ లోయ ఘటన తరువాత భారత్ చైనా దేశాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.  ఇటీవలే ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.  ఈ చర్చల్లో కొంతమేర ఫలితం కనిపించింది.  చైనా మూడు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్ళగా, భారత్ బలగాలు 1.5 కిలోమీటర్ల మేర వెనక్కి వచ్చాయి.  అయితే, చైనాను నమ్మడానికి వీలు లేదని నిపుణులు అంటున్నారు.  జూన్ 6 వ తేదీన ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగినప్పటికీ, జూన్ 15 వ తేదీన చైనా దొంగదెబ్బ కొట్టింది.

    భారత్‌ ను 1962లో కూడా గల్వాన్‌ లోయలో చైనా  నమ్మించి మోసం చేసింది. చైనా అప్పట్లో కూడా గల్వాన్‌ లో లోయలోకి తమ దళాలను పంపింది. ఆ తర్వాత  భారత్‌ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడి నుంచి వైదొలగింది. కానీ, 97 రోజుల తర్వాత హఠాత్తుగా భారత్‌ పై దాడిని ప్రారంభించి అక్సాయ్‌ చిన్‌ ను దక్కించుకొంది. ఈ యుద్ధంలో భారీ సంఖ్యలో భారత్‌ యోధలు అమరులయ్యారు. 38,000 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించింది.  భారత్‌  ఈ సారి సైనిక ఉపసంహరణ విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండకూడదు. ఉపగ్రహాలు, డ్రోన్లతో తనిఖీ చేయడంతోపాటు సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు తమ దళాలను బలోపేతం చేసుకోవాలి. దీంతోపాటు భౌతికంగా కూడా దళాలకు చెందిన ప్రతినిధులను పంపించి చైనా అన్నమాట నిలబెట్టుకొన్నదని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే అది చైనా.. ఏం చేసైనా భూభాగాలను మింగేస్తుంది.కాబట్టి ఈ సమయంలోనే  ఇండియా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.