
ఏపీలో కామన్‌గా వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు నడస్తూనే ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం ఈనాటిది కాదు. అయితే.. జగన్ అధికారంలోకి రావడాన్ని తట్టుకోలేకపోతున్న టీడీపీ ఏదో ఒక రాజకీయం చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మత రాజకీయాలను తెరపైకి తెచ్చింది. ఇప్పుడు ఏపీలో పూర్తిగా మత రాజకీయాలే నడుస్తున్నాయి. ఎప్పుడైతే ఆలయాలపై దాడులు పెరిగాయో అప్పటి నుంచి ఆ రాజకీయాలు మరీ ఎక్కువయ్యాయి. ఇప్పుడు అవి ఇంకాస్త వేడెక్కాయి. ఎంతలా అంటే ఏకంగా చర్చి పాస్టర్లు సైతం రియాక్ట్ కావల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల.. బలవంత మత మార్పిడులపై చంద్రబాబు ఏదో అన్నారు. దీనిపై వైసీపీ అనుకూల పాస్టర్లు కొందరు సోషల్ మీడియాలో చెలరేగిపోతుండడం కలకలం రేపుతోంది.
Also Read: జగన్ ఆయువు పట్టుపై కొడుతున్న సోము వీర్రాజు
చంద్రబాబుని పాస్టర్లు తిడుతున్న వీడియోలను వైరల్ చేయడానికి అధికార పార్టీ సోషల్ మీడియా టీంలు ఆసక్తి చూపుతున్నాయి. కొద్ది రోజుల కిందట టీడీపీకి సంబంధం లేదని క్రిస్టియన్ నేతలు.. టీడీపీకి రాజీనామా చేశారని హడావుడి చేశారు. ఆ తర్వాత టీడీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీపై పాస్టర్లు విరుచుకుపడుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ‘చూడండి చంద్రబాబును పాస్టర్లు ఎలా తిడుతున్నారో ’ అంటూ ఆ వీడియోలను వైరల్ చేసేందుకు తన వంతు ఉప్పు అందిస్తున్నారు.
Also Read: స్పెషల్ స్టోరీ : నేడు ఎన్టీఆర్ 25వ వర్ధంతి !
ఒకవిధంగా చూస్తే ఈ రాజకీయం ఎటుమలుపు తిప్పుతుందో తెలియడం లేదు. చంద్రబాబును తిడితే పూనకం వచ్చినట్లుగా ఊగిపోయే వైసీపీ కార్యకర్తలకు మరోవైపు ఇది బాగానే ఉన్నా రాజకీయంగా తమ పార్టీకి చిక్కులు తెచ్చి పెట్టే అవకాశాలున్నాయన్న అభిప్రాయం మాత్రం ఆ పార్టీ పై స్థాయి నేతల్లో వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో వివాదాస్పదమైన ఇద్దరు పాస్టర్లు ప్రవీణ్ చక్రవర్తి, అజయ్ కిషోర్ ఇద్దరూ బ్రదర్ అనిల్ సంస్థతో కలిసి వ్యవహారాలు చక్క బెడుతున్నవారే. ఇద్దరూ సోషల్ మీడియాలో తమ తమ పోస్టులను పెట్టిన వారే. వైసీపీ నేతలతో బ్రదర్ అనిల్‌తో తమ అనుబంధాన్ని బయట పెట్టుకున్నవారే. ఇద్దరిలో ఒకరు విగ్రహాలను బద్దలు కొట్టేశామని చెబితే.. ఇంకొకరు చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లుగా తిట్లు లంకించుకున్నారు. పాస్టర్ అజయ్ కిషోర్ వీడియోను వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
అలాగే వైసీపీ నేతలు కొత్తగా కొన్ని క్రిస్టియన్ సంఘాలతో ధర్నాలకు ఉసికొల్పుతున్నారు. ఇలాంటి వ్యవహారాలన్నీ.. వైసీపీకి ఆయా వర్గాల్లో మద్దతు పెరగడానికి అవుతాయి కానీ.. ఇతర వర్గాలు దూరమవుతాయి. ఈ విషయం అంచనా వేయకుండా క్రిస్టియన్ సంఘాలను టీడీపీ, బీజేపీపైకి ఎగదోయడానికి సిద్ధమవుతున్న వైనం.. ఇతర రాజకీయ పార్టీల నేతలను కూడా ఆశ్చర్య పరుస్తోంది.