MLA Karanam Dharmasri: మనం ప్రయాణించే రైలు నిమిషం ఆలస్యమైతేనే దాటిపోతుంది. స్టేషన్ కు వచ్చి బాధపడడం మన వంతవుతుంది. అట్లాంటిది పరీక్ష రాసి 24 ఏళ్ల తరువాత ఉద్యోగం వస్తే ఆ వ్యధ ఎవరికీ చెప్పుకోలేనిది. విలువైన సమయాన్ని, ఉపాధిని దూరమైతే ఎదురయ్యే బాధలు అన్నీఇన్నీ కావు. ఏపీలో 1998 డీఎస్సీ అభ్యర్థలు ఇదే బాధను ఎదుర్కొంటున్నారు. పదవీ విరమణ వయసుకు దగ్గర్లో ఉద్యోగాలు రావడం వారికి శాపంగా మారుతోంది. అయితే ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోయిన వారికి తాజా ఉద్యోగం దీపంలా పరిణమించగా.. ఇప్పటికే ఉన్నత రంగాల్లో ఉన్నవారికి మాత్రం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి అల్లక కేదారేశ్వరరావు అసలు తానో ఉద్యోగ అభ్యర్థిననే మరిచిపోయారు. నా అనే వారు లేక దుర్భిక్ష పరిస్థితులను అనుభవిస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు ఉద్యోగం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కానీ అటువంటి లేటు వయసు వారు చాలా మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలా? లేక తాము కొనసాగుతున్న రంగంలో ఉండాలా అని మధనపడుతున్నారు. ఇటువంటి సంశయమే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఎదురైంది. ఆయన రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. రెండు సార్లు గెలిచారు. ప్రస్తుతం చోడవరం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అటువంటి వ్యక్తికి డీఎస్సీ 1998 జాబితాలో చోటు దక్కింది. అప్పట్లో ప్రభుత్వ కొలువు కోసం తాపత్రయ పడిన ఆయన విసిగి వేశారి.. రాజకీయాల్లోకి వచ్చారు. కానీ తన జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం తప్పక వస్తుందని చెప్పారట . ఇప్పుడు అదే నిజమైందని ధర్మశ్రీ ఆనందంగా చెబుతున్నారు.
కరణం ధర్మశ్రీ. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. అదీ మాడుగుల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి రెడ్డి సత్యనారాయణపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుండి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. అప్పుడు టీడీపీ అభ్యర్థి కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014 ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచీ పోటీ విజయం సాధించారు. ఇది ఆయన రాజకీయ ప్రస్థానం.
Also Read: CBI Counter Petition On Jagan: జగన్ టూర్ కు అనుమతి వద్దు.. ప్రత్యేక కోర్టులో సీబీఐ కౌంటర్
అంతకుముందు పాతికేళ్ల పోరాటం ఆయన జీవితంలో ఉంది. పాతికేళ్ల క్రితం అంటే 1998లో ధర్మశ్రీ డీఎస్సీ రాశారు. అప్పుడే అర్హత సాధించారు. కానీ.. ఇన్నాళ్లకు ఆయనకు టీచర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. మొన్న సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కేదారేశ్వరరావు కూడా ధర్మశ్రీకి స్నేహితులే. అయితే విధి వైపరిత్యం అలా ఉంటుందని వీరిద్ధరి విషయంలోనే తెలుస్తోందిగా. ఇక అప్పట్లో మద్రాసు అన్నామలై యూనివర్సిటీలోనే ధర్మశ్రీ చదివారు.
కేదారేశ్వరరరావు మాస్టారుది కూడా ఇదే కళాశాల కావడం విశేషం.ఉపాధ్యాయుడిగా మారాలనుకున్నాను.. కానీ.. ఇలా ప్రజా సేవకుడిని ఎమ్మెల్యేను అయ్యానంటారు ధర్మశ్రీ. 1998 డీఎస్సీ రాశానని, అర్హత సాధించినా అది పెండింగ్‌లో పడటంతో న్యాయవిద్య (బీఎల్) చదవానన్నారు. తర్వాత మెల్లగా ఇక రాజకీయ ప్రవేశం చేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా రెండు నియోజవర్గాలకు ఆయన ప్రానినిధ్యం వహించారు. అప్పట్లో ఉద్యోగం వచ్చి ఉంటే పాలిటిక్స్ కంటే టీచర్ గానే సెటిల్ అయ్యేవాడినని ఆయన చెబుతున్నారు. సో ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా కొనసాగడానికే మొగ్గుచూపుతున్నారు.
Also Read:Political Crisis in Maharashtra: మహారాష్ట్రలోని శివసేన సర్కార్ ను కూల్చే పనిలో బీజేపీ