Homeఎంటర్టైన్మెంట్Director Harish Shankar: దర్శకుడు హరీష్ శంకర్ కి మండింది... వెధవలు, పనికిమాలినోళ్లు అంటూ..!

Director Harish Shankar: దర్శకుడు హరీష్ శంకర్ కి మండింది… వెధవలు, పనికిమాలినోళ్లు అంటూ..!

Director Harish Shankar: దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వెధవలు, పనికిమాలినోళ్లు అంటూ విరుచుకుపడ్డారు. ఇంతకీ హరీష్ శంకర్ కి కోపం ఎందుకు వచ్చిందంటే. పవన్ కెరీర్ లో గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించిన ఆ మూవీ పవన్ వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. హిట్టు కొట్టి ఏళ్ళు గడిచిపోతుండగా దర్శకుడు హరీష్ శంకర్ హిందీ హిట్ మూవీ దబంగ్ రీమేక్ ఐడియాతో పవన్ ని సంప్రదించారు. తన ఇమేజ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే కథ కావడంతో స్క్రిప్ట్ సిద్ధం చేయమని పవన్ చెప్పారు.

Director Harish Shankar
Director Harish Shankar

కేవలం దబంగ్ స్టోరీ లైన్ తీసుకొని పవన్ ఇమేజ్ కి, తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి హరీష్ అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారు. టేకింగ్, వన్ లైనర్స్, ఎలివేషన్స్, అదిరిపోగా.. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ మూవీ తర్వాత హరీష్-పవన్ కాంబినేషన్ మళ్ళీ సెట్ కాలేదు. 2018 లో పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పగా వీరిద్దరి కలయికలో మూవీ కలే అనుకున్నారు. అనూహ్యంగా 2019 ఎన్నికల తర్వాత పవన్ కమ్ బ్యాక్ ప్రకటించారు. అలాగే హరీష్ తో ఓ మూవీ కన్ఫర్మ్ చేశారు.

Also Read: Nayanthara Vignesh Shivan Honeymoon: హనీమూన్ ను నయనతార ఎంతలా ఎంజాయ్ చేస్తుందో తెలుసా? ప్రైవేట్ పిక్స్ వైరల్

పవన్ కోసం మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసిన హరీష్ భవదీయుడు భగత్ సింగ్ అనే అద్భుతమైన టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ అజెండాల కారణంగా భవదీయుడు భగత్ సింగ్ ఆలస్యమైంది. అక్టోబర్ నుండి ఆయన బస్సు యాత్రకు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో హరీష్-పవన్ మూవీ డిలే కానుంది. 2024 ఎన్నికల తర్వాత ఈ చిత్రం అంటూ కథనాలు వెలువడుతున్నాయి.

Director Harish Shankar
Director Harish Shankar

అలాగే విసిగిపోయిన హరీష్ మరో హీరోని వెతుక్కునే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్ట్ తో పాటు తనపై వస్తున్న రూమర్లకు హరీష్ తనదైన రీతిలో సమాధానం చెప్పారు. వేరే సందర్భాన్ని ఉద్దేశిస్తూ సీఎం కేసీఆర్… వెధవలు, పనికిమాలినోళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు, అని ఆయన చేసిన కామెంట్స్ తో కూడిన వీడియో షేర్ చేశారు. కేసీఆర్ వీడియో షేర్ చేయడం ద్వారా వెధవలు చేసే కామెంట్స్ పట్టించుకోనని హరీష్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ ట్వీట్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా భవదీయుడు భగత్ సింగ్ మూవీపై సందిగ్ధత అలానే ఉంది.

Also Read:Bullet Bhaskar Father: అందరి ముందు రష్మీని అవమానించిన బుల్లెట్ భాస్కర్ తండ్రి… అంతలోనే అనుకోని ప్రమాదం

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version