అయ్య‘బాబో’య్.. అంటున్న జనం.!

టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించి కొన్ని రోజులైనా కాలేదు.. ఆయన మాత్రం ఇంకా ప్రజలు తమవైపే ఉన్నారని పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తుండడం విశేషం. రాష్ట్రంలో సంక్షేమ జల్లు కురిపిస్తున్న వైసీపీ ప్రభుత్వం వేరే పార్టీలకు చాన్స్ లేకుండా చేస్తోంది. టీడీపీ తెరమరుగు చేయాలని బీజేపీ-జనసేన పార్టీల నాయకులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డను పట్టుకొని టీడీపీ రాజకీయం చేస్తోందన్న అపవాదును మూటగట్టుకుంది. ప్రస్తుతానికి ఏపీలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షం.. ఇలా ఎన్ని పార్టీలు […]

Written By: NARESH, Updated On : January 29, 2021 10:27 am
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించి కొన్ని రోజులైనా కాలేదు.. ఆయన మాత్రం ఇంకా ప్రజలు తమవైపే ఉన్నారని పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తుండడం విశేషం. రాష్ట్రంలో సంక్షేమ జల్లు కురిపిస్తున్న వైసీపీ ప్రభుత్వం వేరే పార్టీలకు చాన్స్ లేకుండా చేస్తోంది. టీడీపీ తెరమరుగు చేయాలని బీజేపీ-జనసేన పార్టీల నాయకులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డను పట్టుకొని టీడీపీ రాజకీయం చేస్తోందన్న అపవాదును మూటగట్టుకుంది. ప్రస్తుతానికి ఏపీలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షం.. ఇలా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ ఫ్యాను గాలికి గల్లంతు అవుతాయని అధికార పార్టీ భావిస్తోంది..ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఏకగ్రీవాలే లక్ష్యంగా వైసీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రజల్లో చూరగొంటున్న మద్దతు.. పల్లె ప్రజలకు అందుతున్న సదుపాయాలు.. వైసీపీ మద్దతు దారులదే విజయం అనే సంకేతాలు ఇస్తున్నాయి. ఇక ఇతర పార్టీల నేతలు కూడా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రాబు నాయుడు గురువారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతి పంచసూత్రాల పేరుతో ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మేనిఫోస్టోను విడుదల చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో సమర్థవంతమైన పాలన కోసమే ఈ పంచసూత్రాలు అందిస్తున్నట్లు వివరించారు.

ఇంతకీ చంద్రబాబు నాయుడు విడుదల చేసిన పంచసూత్రాలు ఏమిటంటే.. ఉచిత కుళాయిలతో రక్షిత మంచినీరు అందిస్తాం. భద్రత ప్రశాంతతకు భరోసా కలిపిస్తాం.. ఆలయాలపై దాడులను అరికట్టి ప్రజల ఆస్తులకు భధ్రత కలిపిస్తాం.. స్వయం సంవృద్ధి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మెటార్లకు మీటర్లను అడ్డుకుంటాం. ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలు అందిస్తాం.. స్వచ్ఛత పరిశుభ్రత పాటిస్తూ.. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పంచసూత్రాలను ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు తెలిపారు.

పంచసూత్రాలను చదివిన పలువురు ప్రజలు ఇదేం మేనిఫెస్టో అని కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ, వార్డు వలంటీర్లతో సపరిపాలన అందుతోందని.. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేని తరుణంలో ఉచిత కుళాయి.. రక్షిత మంచినీటి పథకాలు తెవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో సంతృప్తిగా ఉన్నామని.. టీడీపీ నాయకులే కుట్రపన్ని ఆలయాలను ధ్వంసం చేసుకున్నారని.. ఈ విషయాన్ని గ్రహించకుండా.. తమ మేనిఫెస్టోలో పెట్టుకోవడం ఏంటని అడుగుతున్నారు. ఇప్పటికే వలంటీర్ల ఆధ్వర్యంలో గ్రామ స్వరాజ్యం దిశగా ఏపీ పల్లెలు ముందుకు సాగుతున్నాయని … చంద్రబాబు ప్రవేశ పెట్టిన పంచసూత్రాల మేనిఫెస్టో ఏమాత్రం ప్రయోజనకరం కాదని పలువురు అంటున్నారు.