https://oktelugu.com/

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై చినజీయర్‌‌ ఫైర్‌‌

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 160కిపైగా ఆలయాల్లో ఈ తరహా దాడులు చోటుచేసుకున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహాన్ని తల వరకూ ఛేదన చేసిన వ్యవహారం మరింత దుమారం రేపుతోంది. Also Read: భారత్ లో కరోనా వ్యాక్సిన్ ఎంతమందికి అవసరం..? అసలు ఎవరు చేశారు..?ఎందుకు చేశారన్న విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ.. రాజకీయ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 2, 2021 2:24 pm
    Follow us on

    Chinna Jeeyar Swamy
    ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 160కిపైగా ఆలయాల్లో ఈ తరహా దాడులు చోటుచేసుకున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహాన్ని తల వరకూ ఛేదన చేసిన వ్యవహారం మరింత దుమారం రేపుతోంది.

    Also Read: భారత్ లో కరోనా వ్యాక్సిన్ ఎంతమందికి అవసరం..?

    అసలు ఎవరు చేశారు..?ఎందుకు చేశారన్న విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ.. రాజకీయ నేతలు మాత్రం స్పందిస్తున్నారు. అయితే.. రాజకీయ నేతలు స్పందించడం వేరు.. ఆధ్యాత్మిక వేత్తలు కామెంట్‌ చేయడం వేరు. ఇప్పుడు ఆ దాడులపై హిందువులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. వ్యవస్థలు ఏమైపోయాయని అడుగుతున్నారు.

    త్రిదండి చినజీయర్ స్వామి రామతీర్థం ఘటనపై నేరుగా స్పందించారు. ఆలయాల్ని రక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. ఈ విషయాల్లో ప్రభుత్వం ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు. ఆ ఆలయాన్ని.. రాముల వారిని ఆసరాగా చేసుకుని ఓ వ్యవస్థ ఉందని వారేమైపోయారని ప్రశ్నించారు. రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నవారు.. రక్షించాల్సిన వారు ఎందుకు నిమిత్తమాత్రులుగా మారారని అడిగారు. అదే సమయంలో భక్తులు ప్రశ్నించడానికి భయపడకూడదని అంటున్నారు. వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మన కోసం రాముల వారు వచ్చారని.. అలాంటప్పుడు ఆయన బాగోగులు మనం చూసుకోవాల్సిందేనన్నారు.

    Also Read: చదువు మధ్యలో ఆపేసిన వారికి గుడ్ న్యూస్.. ఆ స్కీమ్ తో ఉద్యోగాలు..?

    చినజీయర్‌‌ కామెంట్స్‌ చూస్తుంటే రామతీర్థం ఘటనపై ఆయన కలత చెందినట్లుగా అర్థమవుతోంది. సాధారణంగా ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడితే రాజకీయం చేసే ప్రమాదం ఉంది. అందుకే.. ఆయన సున్నితంగా స్పందిస్తూ ఉంటారు. కానీ.. అన్నింటికీ మించి రామతీర్థం వ్యవహారం ఉన్మాద స్థాయికి చేరిందన్న విషయం ఆయనకు తేలిపోయింది. ఇక ఉపేక్షిస్తే.. మరింతగా జరుగుతాయన్న అంచనాతో స్పందించారని అంటున్నారు. రామతీర్థం ఆలయం చిన్నదే కావొచ్చు కానీ.. శతాబ్దాల చరిత్ర ఉంది. భద్రాచలం తెలంగాణలో ఉండిపోవడంతో ఏపీలో శ్రీరామనవమి వేడుకలు ఎక్కడ చేయాలన్న చర్చ వచ్చినప్పుడు ప్రభుత్వం కడపలోని ఒంటిమిట్ట ఆలయంతోపాటు.. విజయనగరం జిల్లాలో రామతీర్థం ఆలయాన్ని కూడా పరిశీలించింది. వివిధ రకాల పరిశీలనలు చేసిన తర్వాత ఒంటి మిట్టను ఎంపిక చేసుకున్నప్పటికీ.. ఆ ఆలయానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ ఆలయంపైనే గురి పెట్టారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్