https://oktelugu.com/

Puri Jagannadh: అప్పట్లో ‘పూరి’ సినిమాలను రిజెక్ట్ చేసిన హీరో.. ఇప్పుడు ఒక్క హిట్ లేదు..

Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు కేరాఫ్, కేవలం డైలాగులతో సినిమాకు క్రేజ్ ను తీసుకురాగల స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తెలుగు ఇండస్ట్రీలో నిలిచిపోయే ఎన్నో భారీ హిట్ సినిమాలను పూరి జగన్నాథ్ అందించాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోలతో భారీ హిట్ సినిమాలు తీసిన పూరి జగన్నాథ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో రిజెక్ట్ చేశాడు. అది కూడా […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 19, 2022 / 09:58 AM IST
    Follow us on

    Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు కేరాఫ్, కేవలం డైలాగులతో సినిమాకు క్రేజ్ ను తీసుకురాగల స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తెలుగు ఇండస్ట్రీలో నిలిచిపోయే ఎన్నో భారీ హిట్ సినిమాలను పూరి జగన్నాథ్ అందించాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోలతో భారీ హిట్ సినిమాలు తీసిన పూరి జగన్నాథ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో రిజెక్ట్ చేశాడు. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేశాడు.

    Puri Jagannadh

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరున్న అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుమంత్.. అప్పట్లో పూరి జగన్నాథ్ సినిమాలతో వెళితే వద్దని చెప్పాడట. నిజానికి సుమంత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో మంచి కథలున్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకానొక పరిస్థితిలో అక్కినేని కుటుంబానికి అసలైన వారసుడు అంటే సుమంతే అనేలా ఉండేది. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయి.. హిట్ కోసం సంవత్సరాలకు. సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది.

    Also Read:  సుధీర్-రష్మీ ప్రేమ.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఇలా చూసి తీరాల్సిందే..

    తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ‘పోకిరి’ సినిమాను సుమంత్ రిజెక్ట్ చేశాడట. ఈ సినిమాను మహేష్ బాబు హీరోగా చేయడంతో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. మహేష్ బాబు కెరీర్ కు పోకిరి టేకాఫ్ హిట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇక అల్లు అర్జున్ కి మాస్ జనాల్లో భయంకరమైన ఫాలోయింగ్ వచ్చేలా చేసిన సినిమా ‘దేశముదురు’ను కూడా సుమంత్ రిజెక్ట్ చేశాడట. ఆ క్యారెక్టర్ తనకు సెట్ కాదని భావించాడో ఏమో కానీ సుమంత్.. దేశముదురు కథను వద్దను కోవడం, తర్వాత అల్లు అర్జున్ దానితో భారీ హిట్ అందుకోవడం జరిగిపోయింది.

    Sumanth Akkineni

    అక్కినేని కుటుంబం నుండి వచ్చిన సుమంత్.. ఆరంభంలో మంచి సినిమాలు చేసినా.. తర్వాత మాత్రం గుర్తింపు కోసం తాపత్రయపడే పరిస్థితి వచ్చింది. ”గోల్కండ హైస్కూల్’, ‘మళ్లీరావా’లతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. దాదాపు తెలుగు ఇండస్ట్రీ నుండి ఫేడవుట్ అయిపోయాడని అందరూ అనుకున్నా.. ఏదోలా హిట్ అందుకొని తిరిగి గుర్తింపు తెచ్చుకున్నాడు సుమంత్.

    Also Read: వెబ్ సిరిస్‌లో సుశాంత్ బిజీ.. ఫస్ట్ లుక్ రిలీజ్..

    Recommended Video:

    Tags