Chinese Spy Balloon Experiment: సాధారణంగా ఉపరితల వాతావరణం గురించి పరిశోధన చేసేందుకు బెలూన్ కి కింది భాగంలో సెన్సార్స్ తగిలించి ప్రయోగిస్తారు. ఈ పని మనదేశంలో కూడా దాదాపుగా 40 ఏళ్ల నుంచి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే సంస్థ హైదరాబాదులోని ఈసీఐఎల్ వద్ద చేస్తోంది. బెలూన్ కు పే లోడ్ తగిలించి వదిలి అది ఉపరితల వాతావరణంలోకి వెళ్లి అక్కడి సమాచారాన్ని సేకరించి తిరిగి భూమి మీద పడిపోతుంది. దాన్లో ట్రాకింగ్ డివైస్ అమర్చుతారు. ఎటువైపు ప్రయాణించి ఎక్కడ పడిపోతుందో తెలుసుకునేందుకే దీనిని ఉపయోగిస్తారు. భూమి మీద పడగానే “టిఫర్” కు చెందిన శాస్త్రవేత్తలు వెళ్లి, దానిని సేకరించి, తిరిగి లేబరేటరీ లో రికార్డు చేసిన డాటాను విశ్లేషిస్తారు. కానీ అది కంట్రోల్ ఫ్లైట్ కాదు. అందుకే తెల్లవారుజామున 4 గంటలకు ప్రయోగిస్తారు. బెలూన్ ప్రయోగించే ముందు దాని సమాచారాన్ని మిలిటరీ, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లకి ఒకరోజు ముందే బెలూన్ ప్రయోగం గురించి సమాచారం ఇస్తారు.

ప్రస్తుతం అమెరికన్ ఎయిర్ స్పేస్ మీద చైనా ఎయిర్ షిప్ ఎగరడానికి అది కంట్రోల్ ఫ్లైట్ గా భావిస్తున్నారు. దీని ఆకారం బెలూన్ మాదిరి గుండ్రంగా ఉంది. ఒక దేశపు ఎయిర్ స్పేస్ మీద ఏదైనా విమానం లేదా మిస్సైల్ లేదా బెలూన్ ఎగిరితే దానిని యుద్దంగా భావిస్తారు. ముందస్తు హెచ్చరికలు లేకుండానే దానికి కూల్చివేసే అధికారం ఆయా దేశాలకు ఉంటుంది. అయితే ప్రయాణికులను చేరవేసే విమానాలకు ఇటువంటి బెలూన్ల వల్ల ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అందుకే ఎయిర్ ఫోర్స్ తో పాటు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లకి ముందుగా సమాచారం ఇస్తారు. అమెరికా మీద ఎగిరిన ఎయిర్ బెలూన్ విషయంలో చైనా చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంది. తన ఎయిర్ షిప్ భూమి మీద నుంచి 60 వేల అడుగుల ఎత్తులో ఉండేలా జాగ్రత్త తీసుకుంది. ప్రయాణికుల విమానాలు 35 వేల అడుగుల ఎత్తుకు మించి ఎగిరేందుకు అనుమతి ఇవ్వరు. అదే జెడ్ ఫైటర్స్ అయితే 60,000 అడుగుల ఎత్తు వరకు ఎగర గలవు. రాఫెల్ ఫైటర్ జెట్ సీలింగ్ 65 వేల అడుగులు. ఇక ఏదైనా మిస్సైల్ ను పరీక్షల కోసం ప్రయోగించేటప్పుడు అది పక్కన ఉన్న ఏ దేశ ఉపరితలం మీదుగా ఎగురుతుందో ఆ దేశానికి ముందే తెలియజేస్తారు..
ఇక అమెరికా ఉపరితల మీద ఎగురుతున్న చైనా ఎయిర్ షిప్ అమెరికాను ఉద్దేశించింది మాత్రమే కాదు. భారత్, జపాన్, పిలిప్పైన్స్ మీదుగా అమెరికా వెళ్ళింది. అంటే ఈ దేశాలు చైనా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి.. చైనా అనుసరిస్తున్న పద్ధతులను తప్పుపడుతున్నాయి.. అందుకే డ్రాగన్ దేశం వీటిపై ఆవేశం పెంచుకుంది. ఈ దేశాల ఆనుపానులు తెలుసుకునేందుకే ఏకంగా ఎయిర్ షిప్ ప్రయోగించింది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ మొదటగా చైనా ఎయిర్ షిప్ ను గుర్తించింది.. మొదట వారు అది వాతావరణాన్ని పరిశీలించేందుకు ప్రయోగించిన అని అనుకున్నారు. కానీ వారు మరింత పరిశోధన చేయగా అది చైనా దేశానికి చెందినదని గుర్తించారు. అది బెలూన్ కాదు… తనంతట తానుగా నిర్దేశించిన మార్గంలో ఆగుతూ అన్నిగా కెమెరాలతో హై రిజల్యూషన్ ఫోటోలు, వీడియోలు తీస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఆకాశంలో 60 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ తూర్పు దిశగా మెల్లగా ప్రయాణిస్తున్నది. ఎయిర్ షిప్ కింది భాగంలో కనీసం రెండు నుంచి మూడు టన్నుల పే లోడ్ ఉంది.. ఒకవేళ దాన్ని కూల్చేస్తే బెలూన్ కింది భాగంలో ఉన్న పే లోడ్ కనుక జనావాసాల మీద పడితే జన నష్టం తో పాటు ఆస్తి నష్టం కూడా జరుగుతుంది కాబట్టి దానిని జనావాసాలు లేని చోట అధికారులు కూల్చేశారు. అప్పటిదాకా దానిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు.

ఇక చైనా అమెరికా మీదకు బెలూన్ ఎందుకు ప్రయోగించిందంటే.. చైనా కొన్ని కీలక రంగాల్లో చాలా అడ్వాన్స్డ్ గా ఉంది.. అవి ఏమిటో చూ చాయగా సమాచారం బయటకు వస్తున్నా అవి వట్టి ఊహాగానాలు తప్పితే అలాంటి టెక్నాలజీ అభివృద్ధి చేయడం చైనా వల్ల అవుతుందా అంటూ అమెరికన్ అధికారులు కొట్టి పారేస్తున్నారు. అఫ్ కోర్స్ కొన్ని అత్యాధునిక ఆయుధాలు అమెరికాలో ఇంకా పరీక్ష దశలోనే ఉండగా.. అలాంటిది చైనా ఎలా తయారు చేయగలుగుతోంది అనే సందేహాలను వెలిబుచ్చుతున్నారు.. కేవలం ఆర్ అండ్ డి కోసమే హీనపక్షంగా 15 సంవత్సరాలు పడుతుంది. అవి అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని వాడాలంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది.. ఒక్కొక్క ఆయుధానికి ఐదు నుంచి పది బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. చైనాకు చెందిన పలు సంస్థలు మారుపేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో ఉన్నాయి కాబట్టి.. దానికి కావలసిన సామాగ్రిని తన ప్రాక్సి కంపెనీల ద్వారా ఆర్డర్ చేసుకొని వాటిని రహస్యంగా చేయి నాకు తరలిస్తుంది.. సింగపూర్,మలేషియా, హాంగ్ కాంగ్, టర్కీ, ఆఫ్రికన్ దేశాలతో పాటు లాటిన్ అమెరికన్ దేశాలలో కూడా ఇవి విస్తరించి ఉన్నాయి.. ఈ కంపెనీలలో చైనీయులు ఎవరూ పని చేయరు. అంత స్థానిక ఉద్యోగులే పని చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికీ అనుమానం రాదు. అమెరికాలో కూడా అమెరికన్లతో నిండి ఉండే సంస్థలు నిజానికి అవి చైనాకు చెందినవే.. చైనా కు చెందిన పలు భారీ కమర్షియల్ భవనాలు అమెరికాలో ఉన్నాయి.. వాటిని అద్దెకి ఇచ్చి చైనా డాలర్లు సంపాదిస్తున్నది.
చైనాకు చెందిన వాణిజ్య భవనాలను అద్దెకి తీసుకుని అద్దె చెల్లిస్తున్న వారిలో అమెరికన్ సెనేటర్స్, ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు.. డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన ప్రధమ శ్రేణి రాజకీయ నాయకులతోపాటు మరో 10 ల తర్వాత అమెరికా అధ్యక్షులు కాగల సామర్థ్యం ఉన్నవాళ్లు కూడా చైనాకు చెందిన అప్పాలు భవనాలకి అద్దె చెల్లించే వారిలో ఉన్నారు. జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ కూడా చైనా కమర్షియల్ స్పేస్ కు అద్దెలు చెల్లిస్తున్న వారిలో ఉన్నారు. అమెరికన్ ట్రెజరీలో మూడు ట్రిలియన్ డాలర్లు చైనాకి చెందినవి డిపాజిట్ రూపంలో ఉన్నాయి..
చైనా ఈ స్థితికి వచ్చేందుకు పరోక్షంగా అప్పటి ఒబామా ప్రభుత్వం సహకరించింది.. ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పెంటగాన్ లోని అమెరికా రక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను చేనార్థం గురించి. అత్యంత పటిష్టమైన ఫైర్ వాల్స్ కలిగిన డి ఓ డి సర్వర్ల నుంచి చైనా హ్యాకింగ్ ద్వారా చాలా ఆయుధాల డిజైన్ల బ్లూ ప్రింట్లను దొంగిలించింది.. తమ డీఓడీ సర్వర్లు హ్యాకింగ్ కి గురయ్యాయని ఎఫ్బీఐ ఒబామా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా అవి డిజైన్లు మాత్రమే… వాటిని ఎగ్జిక్యూట్ చేయడం మనకు తప్పితే వేరే ఏ దేశానికి సాధ్యం కాదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒబామా యంత్రాంగం చాలా తేలిగ్గా కొట్టి పారేసింది. అవే ఇప్పుడు అమెరికా పాలిట శాపంగా మారుతున్నాయి. ఈ విషయంలో చైనాను తప్పుపట్టాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే చైనా బుద్దే అంత కాబట్టి.