Samantha: దాదాపు ఏడాదిన్నరకాలంగా సమంత సింగిల్ గా ఉంటున్నారు. ఆమె 2018లో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లు చైతు, సమంత అన్యోన్య దంపతులుగా మెలిగారు. 2021లో మనస్పర్థలు వచ్చాయి. విడిపోయి సపరేట్ లైఫ్ స్టార్ట్ చేశారు. ఆ క్రమంలో విడాకులు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ వార్తలపై సమంత నోరు విప్పలేదు. సడన్ గా అదే ఏడాది అక్టోబర్ నెలలో విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా ఇరువురు తెలియజేశారు. అప్పటికే జనాల్లో బాగా నలిగిన ఈ న్యూస్ పెద్ద షాక్ ఇవ్వలేదు.

ఎన్ని గొడవలు వచ్చినా మళ్ళీ కలిసిపోతారనే విశ్వాసం అభిమానులు వ్యక్తం చేశారు. వివాదాలు పరిష్కరించుకొని ఒక్కటి కావాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేశారు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా విడాకులు తీసుకోకండని నచ్చజెప్పినట్లు సమాచారం. ఇక ఎందుకు విడిపోయారనే విషయంలో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. నాగ చైతన్య, సమంత ఆరోపణలు ఎదుర్కొన్నారు. చైతు అభిమానులు సమంతను, సమంత అభిమానులు చైతూను బ్లేమ్ చేశారు. సోషల్ మీడియా వార్స్ కూడా జరిగాయి.
సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఆల్రెడీ సమంత వయసు 35. అంటే పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం. లేదంటే ఆమెకు ఇంకా ఏజ్ బార్ అవుతుంది. సమంతకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఓ వాదన ఉంది.మరోవైపు సద్గురు స్వామీజీ ఓ అబ్బాయిని సమంత కోసం ఎంపిక చేశారని, అతన్ని పెళ్లి చేసుకుంటుందన్న వాదన వినిపించింది. ఇవ్వన్నీ ఊహాగానాలు మాత్రమే. నిజంగా సమంత మనసులో ఏముందనేది, సస్పెన్సు.

కాగా సమంతకు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయి. స్వయంగా అభిమానులు సమంతను వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా సమంత ఓ ఆహ్లాదకరమైన ఫోటో షేర్ చేసింది. సదరు ఫోటోకి అభిమానులు భిన్నమైన కామెంట్స్ చేశారు. ఓ అభిమాని ”మేడం మీరు మా ఇంటికి రండి స్వయంగా వంట చేసి భోజనం పెడతాను” అని కామెంట్ చేశారు. మరొక నెటిజన్ ఓ అడుగు ముందుకేసి ”మిమ్మల్ని వివాహం చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి?” అని కామెంట్ చేశారు. గమ్మత్తు ఏంటంటే… అప్పుడప్పుడు సమంత ఇలాంటి కామెంట్స్ కి స్పందిస్తారు. నెటిజెన్స్ కి సమాధానం చెప్తారు.
View this post on Instagram