ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన ఒక్క రోజులో కొత్తగా 134 వైరస్ పాజిటివ్ కేసులు ఫైల్ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,117 కు చేరుకుంది. వైరస్ కు చికిత్స పొందుతూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు చనిపోయారు. దానితో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 58 కు చేరిందని ప్రభుత్వం హెల్త్ బులిటెన్లో బుధవారం వెల్లడించింది.
తాజా కేసుల్లో తొమ్మిది చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌తో లింక్ అయినవేనని బులెటిన్ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 9,664 శాంపిల్ టెస్టులు జరిగాయని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో సహా 48 మంది చికిత్స తర్వాత వివిధ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1913 రికవరీ అయినట్లు పేర్కొంది. మరో 816 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు.