
ప్రపంచంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వినియోగదారుల డేటాను చోరీ చేసేందుకు కొందరు నేరగాళ్లు రకరకాల మార్గాల ద్వారా వ్యూహం పన్నుతున్నారు. ఇటీవల ఎయిర్ ఇండియా డేటా చోరీ దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎయిర్ ఇండియాకు చెందిన కీలక కంప్యూటర్లు హ్యాకింగ్ అయ్యాయని, ఇందులోని 45 లక్షల మంది ప్రయాణికుల వివరాలు తస్కరించినట్లు తెలుస్తోంది. ఇందులో క్రెడిట్ కార్డుల సమాచారం. ఇతర వివరాలు హ్యాకింగ్ గురైనట్లు గుర్తించారు. అయితే ఈ సైబర్ దాడి చేసింది చైనాకు చెందిన వారేనని వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై సింగపూర్ కు చెందిన ‘గ్రూప్-ఐబి’ దృష్టి పెట్టింది. ఎయిర్ ఇండియాపై దాడి చేసిన హ్యాకర్లు కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ వినియోగించినట్లు తెలిపింది. అందులో భాగంగానే ఎయిర్ ఇండియా కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురయ్యాయని ఫోర్బ్స్ అనే పత్రిక బయటపెట్టింది. సింగపూర్ కు చెందిన ఏపీటీ 41 అనే హ్యాకింగ్ బృందం చైనా మద్దతుతో ఈ పని చేసినట్లు ఆ పత్రికలో రాశారు. ఇదే ముఠా అమెరికాలోని మరికొన్ని సంస్థల నుంచి సమాచారాన్ని దొంగిలించినట్లు తెలిపింది.
గ్రూప్ ఐబీ అంచనా ప్రకారం హ్యాకింగ్ ట్రేస్లో భాగంగా ఏటీపీ14 సర్వర్ ను పరిశీలిస్తే అసలు విషయం బయటపడిందని తెలిపింది. ఏటీపీ 41 వినియోగిస్తున్న సర్వర్ ఐపీ అడ్రస్, హ్యాకింగ్ కోసం వాడిన మాల్వేర్ తో పోలుస్తున్నాయని తెలిపింది. అయితే బలమైన ఆధారాలు అవసరమని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఎస్ఐటీఏ మాత్రం దీనిని తోసిపుచ్చింది. ఎయిర్ ఇండియా హ్యాకింగ్ వేరే విషయమని తెలిపింది. కాగా ఏటీపీ 41 హ్యాకర్లు గతంలో ట్రావెల్ మార్కెట్లోని సంస్థలను లక్ష్యంగా చేసుకొని వాటిని ఆధీనంలోకి తీసుకున్నారు.