https://oktelugu.com/

ర్యాపిడ్ టెస్ట్ కిట్లకు అధిక ధర!

కరోనా వైరస్ బారిన పడిన వారిని గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించేందుకు కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ లకు ప్రభుత్వం అధిక ధర చెల్లించింది. దక్షిణ కొరియా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ టెస్ట్ కిట్ లను కొనుగోలు చేసింది. ఈ నెల 17వ తేదీన లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్ లు రాష్ట్రానికి దక్షిణ కొరియా సంస్థ పంపించింది. ఆ దేశం నుంచే ఛత్తీస్ గఢ్ కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ లను కొనుగోలు […]

Written By: Neelambaram, Updated On : April 19, 2020 12:02 pm
Follow us on


కరోనా వైరస్ బారిన పడిన వారిని గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించేందుకు కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ లకు ప్రభుత్వం అధిక ధర చెల్లించింది. దక్షిణ కొరియా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ టెస్ట్ కిట్ లను కొనుగోలు చేసింది. ఈ నెల 17వ తేదీన లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్ లు రాష్ట్రానికి దక్షిణ కొరియా సంస్థ పంపించింది. ఆ దేశం నుంచే ఛత్తీస్ గఢ్ కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ లను కొనుగోలు చేసింది. ఛత్తీస్ గఢ్ ఒక్కో కిట్ ను రూ.377.44 లకు కొనుగోలు చేయడం విశేషం. ఈ మొత్తంలో రూ.337 ధర, 12 శాతం జిఎస్టీ మరో రూ. 40.44 అవుతుంది. ర్యాపిడ్ కిట్ల ధరను ఛత్తీస్ గఢ్ మంత్రి టి.ఎస్ సింగ్ ట్విట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్ లను ఒక్కొక్కటి జిఎస్టీ తో కలిపి రూ.640లకు కొనుగోలు చేసింది. ఇంత ఎక్కువ ధరకు కొనుగోలు చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో 10 లక్షల కిట్ లను కొనుగోలు చేస్తోంది. 75 వేల కిట్ లను మాత్రమే తీసుకుంటున్న ఛత్తీస్ గఢ్ కు ఒక్కో కిట్ రూ. 377.44 లకు అందజేస్తే, 10 లక్షల కిట్లను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరింత తక్కువకు ఇచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు రెట్టింపు ధరకు టెస్ట్ కిట్ లను కొనుగోలు చేయడం విమర్శలకు తావిస్తోంది. కమీషన్ కోసమే ఈ చర్యలకు పాల్పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో 9 లక్షల కిట్ లు రాష్ట్రానికి రావాల్సి ఉంది.

ర్యాపిడ్ కిట్ల కొనుగోలలో ప్రభుత్వ పెద్దలు కమీషన్ కొట్టేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక్కొకిట్ రూ. 1,200 కొనుగోలు చేసి లక్ష కిట్ లకు రూ. 8 కోట్లు కొట్టేసారని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లను ఇంతకు కొనుగోలు చేసిందనే వివరాలు వెల్లడించి పారదర్శకత నిరూపించుకోవాలని ట్వీట్ చేశారు.

ఇతర రాష్ట్రాలకు తక్కువ ధరకే ఇస్తే మేము ధర తగ్గిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి
రెడ్డి మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కిట్ కు రూ. 640 మాత్రమే చెల్లిస్తుందని చెప్పారు. మరిన్ని కిట్ లు రాష్ట్రానికి రావాల్సి ఉన్నందున ధరలపై మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.