సినీ పరిశ్రమకి ఓదార్పు కావాలి

మే 3 త‌ర్వాత లాక్ డౌన్ ఎత్తి వేసినా గాని, ఎత్తి వేయకున్నా గాని తమ ప్రొడక్షన్ , షూటింగ్ వంటి పనులు కొన‌సాగించ‌డానికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు. తెలుగు సినీ పెద్దలు … ఆ క్రమం లో మిన‌హాయింపులు ఇచ్చే రంగాల్లో సినీ ప‌రిశ్ర‌మ‌ను కూడా చేర్చాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరునున్నార‌ట‌. కోవిడ్ 19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ఒక నెల ముందరే థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి, షూటింగులు కూడా ఆగిపోయాయి. థియేట‌ర్లు ఓపెన్ చేస్తే క‌రోనా వ్యాప్ […]

Written By: admin, Updated On : April 19, 2020 11:54 am
Follow us on


మే 3 త‌ర్వాత లాక్ డౌన్ ఎత్తి వేసినా గాని, ఎత్తి వేయకున్నా గాని తమ ప్రొడక్షన్ , షూటింగ్ వంటి పనులు కొన‌సాగించ‌డానికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు. తెలుగు సినీ పెద్దలు … ఆ క్రమం లో మిన‌హాయింపులు ఇచ్చే రంగాల్లో సినీ ప‌రిశ్ర‌మ‌ను కూడా చేర్చాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరునున్నార‌ట‌.

కోవిడ్ 19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ఒక నెల ముందరే థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి, షూటింగులు కూడా ఆగిపోయాయి. థియేట‌ర్లు ఓపెన్ చేస్తే క‌రోనా వ్యాప్ మరింత పెరిగే ప్ర‌మాదం ఉంది కాబ‌ట్టి ప్ర‌భుత్వం జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు థియేట‌ర్లకు అనుమ‌తివ్వ‌దు అని తెలుస్తోంది .. ఒకవేళ జూలై లో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న మొద‌లైనా..ప్రేక్షకులు వస్తారా . అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలి పోతోంది . అందుకే కొత్త సినిమాల విడుదల విష‌యంలో నిర్మాతలు ఏమాత్రం ఆశ‌లు పెట్టుకోవడం లేదు. అందుకే క‌నీసం షూటింగులైనా చేసుకోనిస్తే సినీ వర్గాలకు, మరీ ముఖ్యంగా కార్మికులకు ఉపాధి దొరుకుతుందని అనుకుంటున్నారు.

ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్ర‌తినిధుల బృందం.. తెలంగాణ ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విషయం లో తక్షణం స్పందించక పొతే సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆక‌లి చావులు త‌ప్ప‌వ‌ని.. తెలుగు సినీ రంగం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంద‌ని సినీ పెద్దలు భావిస్తున్నారు . ప్ర‌భుత్వం ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న నేప‌థ్యంలో మే 3 త‌ర్వాత లాక్ డౌన్ ద‌శ‌ల వారీగా ఎత్తివేయ‌క తప్పేలా లేదు. అదే సమయంలో మిగ‌తా రంగాలతో పాటు సినిమా రంగం వాళ్ల‌కు కూడా లాక్ డౌన్ మిన‌హాయింపు ఇవ్వ‌డం ఖాయమంటున్నారు. ఆ క్రమంలో సోషల్ డిస్టెన్స్ పాటించడం తో పాటు, మాస్కులు, గ్లౌజులు వేసుకొని, వీలైనంత త‌క్కువ సిబ్బందితో షూటింగులు చేసుకోవ‌డానికి పర్మిషన్ రావొచ్చని సినీ పెద్దలు భావిస్తున్నారు .