Homeజాతీయ వార్తలుChhatrapati Shivaji Weapon: భారత్‌కు ఛత్రపతి శివాజీ కీలక ఆయుధం.. ఈ వాగ్‌ – నఖ్‌...

Chhatrapati Shivaji Weapon: భారత్‌కు ఛత్రపతి శివాజీ కీలక ఆయుధం.. ఈ వాగ్‌ – నఖ్‌ ప్రత్యేకతేంటి?

Chhatrapati Shivaji Weapon: మరాఠా యోధుడు చత్రపతి శివాజీ వాడిన కీలయ ఆయుధం వాగ్‌–నఖ్‌ను బ్రిటన్‌ నుంచి త్వరలో భారత్‌కు రాబోతోంది. ఈ ఆయుధాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ తెలిపారు. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఉపయోగించిన కత్తి, బాకును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. శివాజీ మహారాజ్‌ పట్టాభిషేకం 350వ వార్షికోత్సవాన్ని త్వరలో ఘనంగా జరుపుకుంటామని అన్నారు.

త్వరలోనే భారత్‌కు..
మరాఠీ ప్రజల వీక్షణ కోసం ‘జగదాంబ’ ఖడ్గం, ‘వాఘ్‌–నఖ్‌’ (పులి గోళ్లలా కనిపించే బాకు)ను అందుబాటులో ఉంచాలని బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ అలాన్‌ గెమ్మెల్, రాజకీయ, ద్వైపాక్షిక వ్యవహారాల డిప్యూటీ హెడ్‌ ఇమోజెన్‌ స్టోన్‌తో చర్చించినట్లు మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ తెలిపారు.

బీజాపూర్‌ సుల్తానేట్‌ హత్య..
1659లో బీజాపూర్‌ సుల్తానేట్‌ జనరల్‌ అఫ్జల్‌ ఖాన్‌ను చంపడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఉపయోగించిన పులి గోళ్ల ఆకారంలో ఉన్న బాకును తిరిగి ఇవ్వడానికి బ్రిటన్‌ అధికారులు అంగీకరించారని, ఈమేరకు అక్కడి అధికారి నుంచి లేఖ వచ్చిందని వెల్లడించారు. మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ తెలిపారు. ఈ నెలాఖరులో ఒక ఎంఓయూపై సంతకం చేయడానికి లండన్‌ వెళ్లనున్నారు. విక్టోరియా మరియు ఆల్బర్ట్‌ మ్యూజియంలో ఈ ఆయుధం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ ఏడాదిలోనే ప్రఖ్యాత వాగ్‌–నఖ్‌ భారత్‌కు వస్తుంది. హిందూ క్యాలెండర్‌ ఆధారంగా శివాజీ అఫ్జల్‌ ఖాన్‌ను చంపిన రోజు వార్షికోత్సవం కోసం దానిని తిరిగి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాగ్‌–నఖ్‌ను తిరిగి తీసుకురావడానికి విధానాలు కూడా రూపొందించారు.

ఎంవోయూపై సంతకం చేయగానే..
ఎంవోయూపై సంతకం చేయడమే కాకుండా యూకేలో ప్రదర్శించిన శివాజీ జగదాంబ ఖడ్గం వంటి ఇతర వస్తువులను కూడా పరిశీలించి, వీటిని కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీంతో పులి గోళ్ల ఆయుధం స్వదేశానికి రావడం ఖాయం.

నవంబర్‌ 10 నాటికి..
గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ఆధారంగా అఫ్జల్‌ ఖాన్‌ హత్య తేదీ నవంబర్‌ 10 అయితే హిందూ తిథి క్యాలెండర్‌ ఆధారంగా తేదీలను రూపొందిస్తున్నారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌ వాగ్‌ – నఖ్‌ చరిత్రలో వెలకట్టలేని నిధి అని, రాష్ట్ర ప్రజల మనోభావాలు వాటితో ముడిపడి ఉన్నాయని, వ్యక్తిగత బాధ్యతతో, శ్రద్ధతో బదిలీ చేయాలి. దీని కోసం, ముంగంటివార్, ప్రధాన కార్యదర్శి సంస్కృతి (డాక్టర్‌ వికాస్‌ ఖర్గే) మరియు డాక్టర్‌ తేజస్‌ గార్గే. రాష్ట్ర పురావస్తు మరియు మ్యూజియంల డైరెక్టరేట్‌ డైరెక్టర్, లండన్‌లోని వీఅండ్‌ఏ, ఇతర మ్యూజియంలను సందర్శిస్తారని సాంస్కృతిక వ్యవహారాల విభాగం జారీ చేసిన ప్రభుత్వ తీర్మానంలో పేర్కొంది.

త్వరలో అండన్‌కు బృందం..
సెప్టెంబరు 29 నుంచి అక్టోబర్‌ 4 వరకు ముగ్గురు సభ్యుల బృందం ఆరు రోజుల పర్యటన కోసం మహారాష్ట్ర దాదాపు రూ.50 లక్షలు ఖర్చు చేయనుంది. ఉక్కుతో తయారు చేయబడిన వాగ్‌ – నఖ్‌లో మొదటి, నాల్గవ వేళ్లకు రెండు ఉంగరాలతో బార్‌పై నాలుగు పంజాలు అమర్చబడి ఉన్నాయని అధికారులు తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular