Hero Siddharth: సిద్ధార్థ.. తెలుగులో ఒకప్పుడు అమ్మాయిలు మనసులో లవర్ బాయ్ గా మిగిలిన హీరో. బాయ్స్. నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. బొమ్మరిల్లు.. సినిమాలతో ఉదయ్ కిరణ్ ..తరుణ్ తర్వాత మనకు అలాంటి హీరో దొరికేశారు అనిపించుకున్నారు ఈ హీరో. నేను కానీ వారిద్దరు లాగానే ఈయన కూడా అతి కొద్ది సమయంలోనే కనుమరుగైపోయారు.
ముఖ్యంగా సమంత.. శృతిహాసన్ లాంటి స్టార్ హీరోయిన్స్ తో తో ప్రేమ ఆ తరువాత బ్రేకప్.. ఇలాంటి పనుల్లో పరి తెలుగు సినిమాలకు దూరమైపోయారు. ఇక ఈ మధ్య తప్పకుండా మంచి హిట్ అందుకుంటాను అని నమ్మకంతో ఆయన రిలీజ్ చేసిన సినిమాలు మహా సముద్రం, టక్కరి కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు యంగ్ టాలెంట్లను ఎంకరేజ్ చేయండి అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు సిద్ధార్థ.
ఇంతకీ ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు అంటే… ‘పెళ్లి చూపులు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సిద్ధిపేట కుర్రాడు అభయ్ నవీన్. కాగా ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అభయ్ నవీన్.. ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘రామన్న యూత్’ అనే హిలేరియస్ పొలిటికల్ డ్రామా సినిమా ద్వారా హీరోగా, రైటర్‌గా, డైరెక్టర్‌గా అభయ్ నవీన్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.
ఈ నేపథ్యంలో ‘రామన్న యూత్’ ట్రైలర్‌ను హీరో సిద్ధార్థ్ చేతుల మీదుగా విడుదల చేయించాడు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న సిద్ధార్థ పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘రామన్న యూత్ టైటిల్ క్యాచీగా ఉంది. అభయ్ నా ఫేవరేట్ యంగ్ యాక్టర్. తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిలింలో అభయ్ యాక్టింగ్ నన్ను బాగా ఆకట్టుకుంది. తరుణ్‌కు ఫోన్ చేసి మాట్లాడా. అభయ్‌లో మంచి యాక్టర్, రైటర్ ఉన్నాడని చెప్పాడు. తర్వాత నా ‘చిన్నా’ సినిమాలో ఓ కీ రోల్ అభయ్ చేశాడు. ఈ సినిమాలో ఒక కథను కాకుండా తను లైఫ్‌లో చూసిన ఊరి అనుభవాలను తెరకెక్కించాడు. ట్రైలర్ చూశాను ఫన్ ఉంది. అలాగే ఫన్ వెనక ఒక ఎమోషన్ ఉంది. ఎక్కడైనా యూత్ గెలవాలి. ఈ సినిమా వచ్చేవారం థియేటర్‌లోకి వస్తోంది.థియేటర్‌లోనూ రామన్న యూత్ గెలవాలి. నేను థియేటర్‌లో ఈ సినిమా చూస్తా. మిమ్మల్ని చూడమని కోరుతున్నా. ఎందుకంటే నేను ఇలానే చిన్నవాడిగా ఇండస్ట్రీకి వచ్చాను. ఇలాంటి యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయమని కోరుతున్నాను’ అని అన్నారు.
మొత్తానికి యంగ్ ఏజ్ లో వచ్చి మంచి హిట్లు అందుకున్న ఈ హీరో.. ప్రస్తుతం హిట్లు లేకపోయినా.. ఇలాంటి యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం ఆయన చేస్తున్న మంచి పనే అని చెప్పాలి.