AP Cabinet: మంత్రివర్గంలో మార్పులు.. మందస్తు సంకేతాలు.. జగన్ లో స్పష్టమైన మార్పులు

AP Cabinet: ప్రజలు అంతులేని మెజార్టీ ఇచ్చారు. ఐదేళ్ల పాలించే అవకాశం కల్పించారు. అయినా మా ప్రభుత్వంపై కుట్రలు ఏమిటి? ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరైనా విమర్శలు చేసినా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతికూలంశాలు బయటపడినప్పుడు సీఎం జగన్ నుంచి మంత్రుల వరకూ చేసే ప్రకటన ఇది. అటువంటిది సీఎం జగనే ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తుకు వెళతారని ప్రచారం సాగుతోంది. ముచ్చటగా తాను ఎంపిక చేసిన రెండో కేబినెట్ లో సమూల మార్పులు తీసుకొస్తారన్న టాక్ నడుస్తోంది. అంతులేని మెజార్టీతో, […]

Written By: Dharma, Updated On : March 30, 2023 1:07 pm
Follow us on

JAGAN

AP Cabinet: ప్రజలు అంతులేని మెజార్టీ ఇచ్చారు. ఐదేళ్ల పాలించే అవకాశం కల్పించారు. అయినా మా ప్రభుత్వంపై కుట్రలు ఏమిటి? ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరైనా విమర్శలు చేసినా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతికూలంశాలు బయటపడినప్పుడు సీఎం జగన్ నుంచి మంత్రుల వరకూ చేసే ప్రకటన ఇది. అటువంటిది సీఎం జగనే ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తుకు వెళతారని ప్రచారం సాగుతోంది. ముచ్చటగా తాను ఎంపిక చేసిన రెండో కేబినెట్ లో సమూల మార్పులు తీసుకొస్తారన్న టాక్ నడుస్తోంది. అంతులేని మెజార్టీతో, మరో 30 సంవత్సరాలు సీఎంగా పాలిస్తానన్న జగన్ కు ఏంటీ ఖర్మ అంటూ సగటు హార్ట్ కోర్ ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. అనూహ్య నిర్ణయాల వెనుక అధినేత కష్టాలను చూసి ఆందోళన చెందుతున్నారు.

అన్నీ వారి చేతుల్లో పెట్టి..
ఎవరి మాట వినరు అన్న అపవాదును సీఎం జగన్ సొంతం చేసుకున్నారు. కానీ 2014 ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ లో స్పష్టమైన మార్పు వచ్చింది. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్నారు. పీకే చెప్పినట్టుగా నడుచుకోవడం ప్రారంభించారు. ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో, ఎన్నికల ప్రచార ఖర్చులు, ప్రచార నినాదాలు.. ఇలా పీకే టీమ్ ఏది చెబితే అది చేశారు. గత ఎన్నికల్లో అద్భుత విజయం సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి పీకే టీమ్ పై మరింత నమ్మకం ఏర్పాటుచేసుకున్నారు. నమ్మకస్థులను సలహాదారులుగా పెట్టుకున్నారు. అలా నియమితులైన వారే సజ్జల రామక్రిష్ణారెడ్డి. పార్టీలో, ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యత పెంచుతూ వచ్చారు. ఆయన ఇచ్చిన సలహానో.. మరి ఏమో తెలియదు కానీ మంత్రివర్గంలో బలవంతులను తప్పించి బలహీనవర్గాల వారికి పెద్దపీట వేశారు. ఎంతసేపు బీసీ జపం పఠించారే తప్ప… కేబినెట్ లో సమర్థులకు ఇచ్చానా? లేదా? అన్నది ఆలోచించలేదు.

ఫెయిల్యూర్స్ కు వారే కారణం?
సామాజిక సమీకరణలు, కుల గణనలో ఐ ప్యాక్ టీమ్ తో పాటు సజ్జల పార్టీలో అగాధం సృష్టించారని జగన్ ఎట్టకేలకు తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో సీన్ మొత్తం అర్ధమైంది. సామాజిక సమీకరణాల పేరుతో పార్టీలో తనకు తానే చిచ్చు పెట్టుకున్నానని జగన్ గుర్తించినట్టు తెలుస్తోంది. కొడాలి నాని, పేర్ని నాని వంటి విశ్వాసపాత్రుల్ని వదులుకున్నానని అంతర్మథనం చెందుతున్నారుట. దూకుడుగా ఉండే వారిని కేబినెట్ నుంచి తప్పించి పెద్దగా నోరు తెరవని వారికి పదవులిచ్చామని తెగ బాధపడుతున్నారుట.తన కోసం నిలబడిన సీనియర్లకు పదవులివ్వడంలోనూ తప్పు జరిగిందని భావిస్తున్నారుట. ఆ తప్పులన్నీ దిద్దుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. కొడాలి నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలతో పాటు మరికొంత మంది విధేయులకు మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారుట.

AP Cabinet

పునరాలోచనకు అవే కారణాలు..
సీఎం జగన్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇదివరకులా దీమా కనిపించడం లేదు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ సీఎం జగన్ ఐ ప్యాక్, సజ్జల రామకృష్ణారెడ్డిపై పూర్తి స్థాయిలో ఆధారపడ్డారు. ప్రతి చిన్న విషయంపై వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకున్నారు. చివరకు కేబినెట్ కూర్పులోనూ వారిదే ముద్ర . అయితే ఇప్పుడు ఐ ప్యాక్ టీమ్, సజ్జల రామక్రిష్ణారెడ్డి వ్యూహాలు ఫెయిలవుతున్నాయి. అటు మంత్రుల్లో 1పాత టీం కన్నా కొత్త టీం ఏ మాత్రం ప్రభావవంతం చూపలేకపోతోంది. అందుకే జగన్ పునరాలోచనలో పడ్డారు. సొంత నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఢిల్లీ పెద్దల సహకారంతో ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. మొత్తానికైతే అంతులేని విజయం నుంచి ప్రస్తుత పరిస్థితుల దాకా ఎదురైన పరిణామాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు. అందుకే ఉన్న ఈ కొద్దిరోజులైనా స్వయం నిర్ణయాలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.