CM Jagan cabinet: జగన్ షాకింగ్ నిర్ణయం..! మంత్రులంతా ఔట్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? పాలనను ప్రక్షాళన చేయబోతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.. ఎవరూ ఊహించని విధంగా కేబినెట్లో మార్పులు చేయబోతున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు మంత్రులుగా కొనసాగుతున్న వారు జగన్ తీసుకున్న నిర్ణయంతో షాక్ తినడం ఖాయం అంటున్నారు. ఇన్నాళ్లుగా మంత్రి హోదాలో కొనసాగిన వారు తమ పదవులు పోతాయనే ఆందోళనలో పడ్డారట. జగన్ కు అనుకూలంగా.. వ్యతిరేకంగా ఉన్నవారందరి పరిస్థితి ఒకే రకంగా ఉందని అంటున్నారు. ఇంతకీ జగన్ […]

Written By: NARESH, Updated On : August 19, 2021 10:32 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? పాలనను ప్రక్షాళన చేయబోతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.. ఎవరూ ఊహించని విధంగా కేబినెట్లో మార్పులు చేయబోతున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు మంత్రులుగా కొనసాగుతున్న వారు జగన్ తీసుకున్న నిర్ణయంతో షాక్ తినడం ఖాయం అంటున్నారు. ఇన్నాళ్లుగా మంత్రి హోదాలో కొనసాగిన వారు తమ పదవులు పోతాయనే ఆందోళనలో పడ్డారట. జగన్ కు అనుకూలంగా.. వ్యతిరేకంగా ఉన్నవారందరి పరిస్థితి ఒకే రకంగా ఉందని అంటున్నారు. ఇంతకీ జగన్ ఏందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు? మొత్తం కేబినెట్ ప్రక్షాళనను ఎందుకు చేస్తున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామంతో ఇప్పుడు మంత్రులంతా భయపడుతున్నారట.?

2019లో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలన మొదలై దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఈ మూడేళ్ల కాలంలో రెండేళ్లు కరోనాతోనే గడిచిపోయింది. గట్టిగా చెప్పాలంటే ఏడాదిపాటు జగన్ పరిపాలన సాగింది. అయితే మొదటిసారి వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ అధికార వ్యవహారాలు చక్కదిద్దడానికే ఈ సమయం గడిచిపోయిందంటున్నారు. అటు జగన్ తో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసి కొందరు పదవులు చేజిక్కించుకున్నారు. అయితే మంత్రులుగా కొనసాగుతున్న దాదాపు అందరిలో సంతృప్తి లేదనే తెలుస్తోంది.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జగన్ మూడేళ్లకు కేబినెట్ విస్తరణ ఉంటుదని ప్రకటించారు. దీంతో మూడేళ్ల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కొందరు మంత్రుల్లో భయాందోళన మొదలైంది. అప్పటి వరకు జగన్ కు అనుకూలంగా ఉండేవాళ్లు తమ పదవి పోదనే ధీమాతో ఉండగా కొందరు వ్యతిరేకంగా ఉన్నవారు మాత్రం తమ పోస్టు ఉంటుందో లేదోనని భయపడ్డారు. మరోవైపు మంత్రి పదవి చేపట్టి రెండున్నరేళ్లు గడిచిపోయినా తమ డాపు, దర్పం ఉపయోగించింది మాత్రం ఏడాదిపాటేనే అనుకుంటున్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తాము మంత్రి హోదాలో ప్రజల వద్దకు వెళ్లింది తక్కువేనని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా జగన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట. కేబినెట్ మార్పులు చేసేందుకు సన్నద్ధమవుతున్నారని తెలిసింది. సీఎం జగన్ ఈసారి కేబినెట్లోని మంత్రులనందరినీ మార్చేస్తామని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2024 ఎన్నికలే లక్ష్యంగా జగన్ ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాంగా ప్రధాని మోడీ ఫార్మూలాను పాటించాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఉన్న కేబినెట్ మొత్తాన్ని మార్చేసి కొత్త మంత్రులను నియమించుకుంటారట. సీనియర్లకు చివరి రెండేళ్లు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారట. ప్రజలకు పార్టీని దగ్గర చేసే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్న నేపథ్యంలో మరో ఏడాది పాటు అధికార కార్యకలాపాలు సీరియస్ గా కొనసాగిస్తారు. ఆ తరువాత ఏడాది ఎన్నికల కోసమే కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే కొత్త మంత్రులను నియమించుకొని ఇప్పుడున్న వారికి పార్టీ బాధ్యతలు ఇవ్వనున్నారట. 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు, ప్రతిపక్షాలు కోలుకునే అవకాశం లేకుండా రాజకీయంగా ఎదుర్కోవాలనేదే జగన్ వ్యూహంగా తెలుస్తోంది.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు దగ్గరైంది. అయితే కొన్నిచోట్ల లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందకపోవడంతో పార్టీపై రిమార్క్ వచ్చే అవకాశం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఉండకూదనే ఉద్దేశంతో పార్టీని సీనియర్ నాయకులకు అప్పగించనున్నారు. వీరు దగ్గరుంచి పార్టీ వ్యవహారాలను చక్కబెట్టనున్నారు.

కేబినేట్ విస్తరణలో కొంత మందిని తీసేసి మరికొందరిని మారిస్తే అసంతృప్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో పార్టీ పార్టీ ప్రతిష్టతకు దెబ్బ పడుతుంది. దీంతో అందరీనీ తప్పిస్తే ఏ సమస్య ఉండదని జగన్ భావించినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న వారు మరికొద్దిరోజులు మాత్రమే తమ అధికారాన్ని ఉపయోగించుకోనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా జగన్ కేబినెట్ పూర్తి ప్రక్షాళన చేయబోతున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది..