Ind Vs Eng test series: భారత్ దెబ్బ.. ఇంగ్లండ్ జట్టులో భారీ మార్పులు

ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో భారత్ కొట్టిన దెబ్బకు ఇంగ్లండ్ తట్టుకోలేకపోతోంది. అక్కడి మీడియా, క్రికెట్ మాజీలు జట్టు కూర్పు, ఆటతీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఏం ఆడుతున్నారని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ జట్టు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆడని వారిని తీసేసి కొత్త వారిని తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఇంగ్లండ్ జట్టులో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమైంది. రెండో టెస్టులో గెలవాల్సిన స్థితి నుంచి ఇంగ్లండ్ ఓడిపోయింది. దీంతో మిగిలిన టెస్టుల్లో ఎలాగైనా గెలవాలనే కసితో రూట్ […]

Written By: NARESH, Updated On : August 20, 2021 11:18 am
Follow us on

ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో భారత్ కొట్టిన దెబ్బకు ఇంగ్లండ్ తట్టుకోలేకపోతోంది. అక్కడి మీడియా, క్రికెట్ మాజీలు జట్టు కూర్పు, ఆటతీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఏం ఆడుతున్నారని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ జట్టు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆడని వారిని తీసేసి కొత్త వారిని తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఇంగ్లండ్ జట్టులో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమైంది.

రెండో టెస్టులో గెలవాల్సిన స్థితి నుంచి ఇంగ్లండ్ ఓడిపోయింది. దీంతో మిగిలిన టెస్టుల్లో ఎలాగైనా గెలవాలనే కసితో రూట్ సేన ఉంది. ఇందుకోసం మూడో టెస్టు నుంచే జట్టులో సమూల మార్పులకు దిగింది. ఇద్దరు ఆటగాళ్లపై వేటు వేసి టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ ను జట్టులోకి తీసుకుంది.

నిజానికి సొంత గడ్డపై భారత్ చేతిలో ఓడిపోవడం ఇంగ్లండ్ కు తలకు మించిన భారంగా ఉంది. భారత్ తో జరిగిన తొలి టెస్టులో వర్షం అంతరాయం కలుగకపోతే ఆ టెస్ట్ కూడా భారత్ వశమయ్యేదని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే మూడో టెస్ట్ ఈనెల 25 నుంచి లీడ్స్ లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే జట్టును ప్రక్షాళన చేయడానికి ఇంగ్లండ్ రెడీ అయ్యింది.

భారత్ తో లీడ్స్ లో ఈనెల 25 నుంచి జరిగే మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బుధవారం ప్రకటించాయి. మూడో టెస్టు కోసం టీ20 స్పెషలిస్ట్ డేవిడ్ మలాన్ ను జట్టులోకి తీసుకుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ చివరి రెండు టెస్టుల్లో తడబడిన కారణంగా మలన్ కు ఆహ్వానం అందింది.

ఇక ఇంగ్లండ్ టీంలో వరుసగా విఫలమవుతున్న డామ్ సిబ్లే, జాక్ క్రాలేలను పక్కనపెట్టింది. వీరు తిరిగి తమ కౌంటీ జట్లకు ఆడనున్నారు. జాక్ లీచ్ ను తీసుకుంది. మెయిన్ అలీకి ప్రత్యామ్మాయంగా ఇతడిని జట్టులోకి తీసుకుంది. సీమర్ సాకిబ్ మహమూద్ కు జట్టులో చోటు కల్పించింది. ఇక రోరీ బర్న్స్ విఫలమవుతున్నా అతడికి మరో అవకాశం ఇచ్చింది. ప్రపంచ టీ20 నంబర్ 1 బ్యాట్స్ మెన్ అయిన డేవిడ్ మలాన్ దూకుడు ఆట ఇంగ్లండ్ కు ఉపయోగపడుతుందని.. ఇటీవలే డబుల్ సెంచరీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో చేయడంతో అతడిని ఎంపిక చేసింది. మలన్ జట్టును ఆదుకుంటాడో లేదో చూడాలి. ఇక మార్క్ ఉడ్ భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతడు దూరమైతే టీంకు ఎదురుదెబ్బనే.