నాని ఏమి పోస్ట్ పెట్టాడంటే.. ‘నా సినిమాను నాకు థియేటర్లలోనే చూసుకోవాలని ఉంది. అయితే, ‘టక్ జగదీష్’(Tuck Jagadish) సినిమా రిలీజ్ విషయంలో తుది నిర్ణయాన్ని నిర్మాతలకే వదిలేశాను. నేను ఎప్పటికీ థియేటర్లకి పెద్ద అభిమానిని. ‘టక్ జగదీష్’ పెద్ద తెర పై చూసి ఆస్వాదించాలి అనుకున్నాను. నిర్మాతలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, వాళ్ల పెట్టుబడులు నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను.
నేను చాలా నలిగిపోతున్నా. ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లపై ఆంక్షలు ఉన్నాయి. అందుకే, సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఎలాగైనా సరే… ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరేలా చేయడం నా బాధ్యత. దాని కోసం వందశాతం నా వంతు ప్రయత్నం కచ్చితంగా చేస్తాను’’ అంటూ నాని ఒక లెటర్ పోస్ట్ చేశాడు.
నాని – శివ నిర్వాణ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘నిన్ను కోరి’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అందుకే ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ‘టక్ జగదీష్’ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. కాబట్టి త్వరలోనే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు.
ఈ సినిమా పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా, ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నానికి అన్నయ్య పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడు.