Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనపై టీడీపీ దుమ్మెత్తిపోస్తోంది. రాష్ట్రంలో వరదలు సంభవిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలు సంభవిస్తాయని ముందే తెలిసినా ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల గోడు తెలుసుకున్నారు. అనంతరం పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్ల గ్రామంలో పర్యటించి బాధితులను ఉద్దేశించి ప్రసంగించారు.

వైఎస్ జగన్ కు ప్రజల కష్టాలంటే లెక్కలేదు. ఎప్పుడు తన స్వార్థం కోసమే ఆలోచించే ముఖ్యమంత్రి బహుశా జగనే కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోంది. నియంతృత్వ ధోరణిలో జగన్ పరిపాలన ఉంటోంది. అయినా ప్రజలు భరిస్తున్నారు. కానీ జగన్ కు మాత్రం ఏ మాత్రం పట్టింపు లేదు. వరద ఇంత పెద్ద మొత్తంలో వస్తున్నా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. వరదలు కొనసాగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? ప్రభుత్వాన్ని ఎదిరించే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై కేసులు పెడుతూ ఆయనను నియోజకవర్గంలో పర్యటించకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని తన వాళ్లతోనే చంపించి కేసును తనపై వేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. జగన్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలోవైసీపీ ఓటమి ఖాయమని తెలిసిపోతోంది. ఈ క్రమంలో ప్రజల బాగోగులు చూడని ప్రభుత్వంగా రికార్డులకెక్కుతోంది.

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బాబుకు బాధితులు తమ బాధలు చెప్పుకున్నారు. దీంతో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసి వరద ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలు తీరుస్తామన్నారు. భవిష్యత్ లో కూడా వరదలు రాకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా సహాయక చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేస్తామని హామీ ఇచ్చారు. బాధితుల పక్షాన నిలబడి పోరాడతామన్నారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు.