Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో రాజకీయంగా ఎదగాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే పలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని టీడీపీ, ప్రతిపక్షాన్ని ఎలాగైనా కట్టడి చేయాలని వైసీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. దీనికి గాను టీడీపీ తనకు బలమైన జిల్లాగా చెప్పుకునే కృష్ణాపై ఓ కన్ను వేసింది.
ఈ నేపథ్యంలో మరో ఏడాదిన్నరలో ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిస్తున్నారు. దీంతో గత ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ గెలిచిన రెండు సీట్లలో ఒకటైన గన్నవరంలో వల్లభనేని వంశీ పార్టీ మారి వైసీపీలో చేరారు. దీంతో ఈ స్థానంపై పట్టు సాధించాలని టీడీపీ భావిస్తోంది. దీంతో పాటు మరో రెండు స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం టీడీపీ అన్వేషణ ప్రారంభించింది.
మరోవైపు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను గన్నవరం పంపాలని భావిస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ నుంచి గెలిచిన రామ్మోహన్ ను వంశీకి చెక్ పెట్టేందుకు సమ ఉజ్జీగా భావిస్తున్నారు. దీంతో ఆయనను వంశీపై పోటీకి నిలిపేందుకు చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రసవత్తర పోరు సాగనుందని తెలుస్తోంది.
Also Read: Festivals: పండుగల వేళ.. ప్రజలకు ఇబ్బందులొద్దు
దీంతో విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వంగవీటి రాధాను పంపనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు చెబుుతన్నారు. మొత్తానికి ఏపీలో రాబోయే ఎన్నికల్లో పలు కోణాల్లో వ్యూహాలు రచించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చే పనిలో భాగంగా పలు మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Sentiment politics: రాజకీయాల్లో ‘సానుభూతి’కి కాలం చెల్లిందా?