https://oktelugu.com/

Radhe Shyam Movie: ప్రభాస్ రాధే శ్యామ్ నుంచి కృష్ణంరాజు లుక్ రిలీజ్…

Radhe Shyam Movie: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ వర్క్‌ చేస్తుండటం విశేషం. ఇక ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి […]

Written By: , Updated On : December 20, 2021 / 07:08 PM IST
Follow us on

Radhe Shyam Movie: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ వర్క్‌ చేస్తుండటం విశేషం. ఇక ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ లో జోరు పెంచింది. వరుసగా పాటలు రిలీజ్‌ చేస్తూ మూవీ పై హైప్‌ పెంచుతుంది.

krishnam raju look released from prabhas radhe shyam movie

తాజాగా ఈ సినిమా నుంచి సీనియర్‌ నటుడు కృష్ణంరాజు లుక్‌ను రిలీజ్‌ చేసింది. పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు పోస్టర్‌ ద్వారా అధికారికంగా వెల్లడించింది. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర కోసం ఆయన ఏడాదిగా గడ్డం పెంచారు. గతంలో కృష్ణం రాజు, ప్రభాస్‌తో కలిసి ‘బిల్లా’, ‘రెబల్’‌ సినిమాల్లో కలిసి నటించారు. ఆయన చివరి సారిగా 2015లో వచ్చిన ‘రుద్రమదేవి’ చిత్రంలో గణపతి దేవుడుగా కనిపించారు. ఇన్నేళ్ల గ్యాప్‌ తర్వాత రాధేశ్యామ్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్​, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్​ చేశాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కాగా, ఇటీవలే సంచారి పాటలో మరో రికార్డుకు తెరలేపారు ప్రభాస్​. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ ను డిసెంబరు 23న రామోజీ ఫిల్మ్​ సిటీలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్లాన్​ చేశారు.