Vangaveeti Radha: ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ అర్థం కావు. ఒక్కసారిగా వేడెక్కుతాయి. మరల కొన్నిరోజులు సైలెంట్ అయిపోతాయి. నాయకులు అనాలోచితంగా చేసే కామెంట్స్ వలన అక్కడి రాజకీయాల్లో హడావుడి కనిపించినా ప్రజలు మాత్రం వాటిని లైట్ తీసుకుంటారని తెలుస్తోంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంది.

మొన్నటివరకు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఏపీ మంత్రి చులకలన మాట్లాడారు. వారు రైతులు కాదని, టీడీపీ పార్టీకి చెందిన పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత టీడీపీ నేత పట్టాభి జగన్‌ను ధూషించడం.. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నేతలు చంద్రబాబు ఫ్యామిలీని దూషించడం, తాజాగా వంగవీటి రాధ తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించడం ఇవన్నీ చూస్తే ప్రజల అటెన్షన్‌ను డైవర్ట్ చేసేందుకు చేసినవిగా కొందరు భావిస్తున్నారు.
వంగవీటి రాధ ఆరోపణలు నిజమేనా..
వంగవీటి రాధ 2019 ఎన్నికల ముందు టీడీపీ పార్టీలో చేరారు. తీరా ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా తన హత్యకు కుట్ర జరుగుతోందని కామెంట్స్ చేయడం అక్కడ సంచలనంగా మారింది. వంగవీటి రాధా పాలిటిక్స్‌లో ప్రస్తుతం యాక్టివ్‌గా లేరు. పేరుకే టీడీపీ నేత.. బలమైన నేతగా నియోజకవర్గంలో పేరు లేదు. అలాంటప్పుడు ఆయన్ను ప్రత్యర్థులు చంపాల్సిన అవసరం ఏముంది. పాత కక్ష్యలు ఏమైనా ఉంటే ఇన్నిరోజులు ఎందుకు చంపలేదని అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Also Read: చంద్రబాబుకు ఈజీగా అధికారం దక్కబోతోందా?
చంద్రబాబు మౌనం ఎందుకు..?
టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఎవరైనా అపాయం తలపెట్టారని తెలిస్తే వెంటనే స్పందించే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ ఎందుకు స్పందించలేదు. వంగవీటి రాధ ఆ కామెంట్స్ చేసినప్పుడు ఆయన పక్కన మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారని తెలుస్తోంది. వీరితో చర్చల అనంతరం పార్టీ నుంచే మారేందుకు ఈ వ్యాఖ్యలు చేసి వైసీపీ పార్టీకి దగ్గరై సెక్యూరిటీ పొందాలని వంగవీటి రాధా ఈ కామెంట్స్ చేసి ఉండవచ్చని పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. లేకపోతే తనను ఎవరు చంపేందుకు చూసారో వారి పేరు చెబితే వాళ్ల సంగతి పోలీసులు చూసుకుంటారు కదా..? ఈ రెండు కాకపోతే ప్రజల్లో తాను స్థానం పొందేందుకు రాధా ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చని రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
Also Read: జనసేన గూటికి వంగవీటి రాధాకృష్ణ ?.. కీలక భేటి