Chandrababu NSG Security: ఏపీలో రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సభలు, సమావేశాల పేరిట బల ప్రదర్శనలకు దిగుతున్నారు. భౌతిక దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు రాష్ట్ర పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ నేతల భద్రతపై కేంద్ర భద్రత సంస్థలు ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాయి. అందులో భాగంగా ఏపీలో విపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబుకు భారీగా భద్రతను పెంచారు. చంద్రబాబు సెక్యూరిటీని రివ్యూ చేసిన ఎన్ఎస్జీ కొత్తగా మరో 20 మంది కమెండోలతో భద్రత కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ కింద షిఫ్ట్ కు ఎనిమిది మంది చొప్పున భద్రత కల్పించేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను మరో 20 మందికి పెంచారు. ఇప్పటివరకూ డీఎస్పీ స్థాయి అధికారే చంద్రబాబు భద్రతను పర్యవేక్షించే వారు. ఇక నుంచి డీఐజీ స్థాయికి పెంచారు.డీఐజీ స్థాయి అధికారే భద్రతను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్ఎస్జీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు భద్రతను పెంచడం మాత్రం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

రాజకీయ పరిస్థితులతోనే..
ఇటీవల ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. అత్యంత దారుణంగా తయారయ్యాయి. ప్రత్యర్థులపై భౌతిక దాడులు కూడా తెగబడే పరిస్థితులు నెలకొన్నాయి. అవసరమైతే భౌతికంగా నిర్మూలించేందుకు కూడా వెనుకడుగు వేయని దుస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయాన్ని నిఘా సంస్థలు కేంద్రానికి నివేదించాయి. సాధారణంగా ఫిర్యాదులు, విన్నపాలు చేస్తే భద్రత పెంచరు. సదరు వ్యక్తికి భద్రత కరువైనట్టు నిఘా సంస్థలు చేరవేసినా, ప్రమాదముందని తెలిసినా భద్రతను పెంచుతారు.
Also Read: Ghulam Nabi Azad: ఆజాద్ కూడా పాయే.. కాంగ్రెస్ ను ఇక ఎవరూ కాపాడలేరు! రాహుల్ పై సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు విషయంలో కూడా ఇటువంటి హెచ్చరికలు వెళ్లడంతో ఆయన భద్రతను రెండింతలు పెంచారు. అయితే ఇటీవల వరుస ఘటనల నేపథ్యంలోనే చంద్రబాబుకు భద్రత పెంచినట్టు తెలుస్తోంది. ఆయన పర్యటనల సమయంలో కొన్ని పరిణామాలు కలవరపెడుతున్నాయి. అటు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత, పోలీసు బందోబస్తు ఉన్నా సభలు, సమావేశాల్లో ప్రతికూల పరిస్థితులు, రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

నిఘా వర్గాల హెచ్చరికలతో..
చంద్రబాబు విషయంలో ఏపీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలైతే ఉన్నాయి. పర్యటనల సమయంలో చంద్రబాబుపై ఆకతాయిలు రాళ్లు రువ్వినా పట్టించుకోవడం లేదు.కాన్వాయ్ ను అడ్డగిస్తున్నా కూడా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. నిన్నటికి నిన్న కుప్పంలో రాజకీయ ప్రత్యర్థలు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. టీడీపీ బ్యానర్లను, ఫ్లెక్సీలను తొలగించారు. చివరకు ప్రారంభానికి సిద్ధం చేసిన అన్న క్యాంటీన్ ను కూడా ధ్వంసం చేశారు. వారు ఎటువంటి కవ్వింపు చర్యలు చేస్తున్నా ఏపీ పోలీసులు కట్టడి చేయడం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించడంలో ఏపీ పోలీస్ శాఖ వైఫల్యం చెందిందన్న విమర్శలున్నాయి. ఇదే విషయాన్ని నిఘా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి చేరవేశాయి. దీంతో కేంద్రం చంద్రబాబు భద్రతను పెంచినట్టు తెలుస్తోంది.
Also Read:Chandrababu: బాబు భారీ స్కెచ్..నాలుగు ప్రాంతాల్లో క్యాంపెయిన్ తనవారితోనే..
[…] Also Read: Chandrababu NSG Security: చంద్రబాబుకు 30 మంది కమాండోలత… […]