Homeజాతీయ వార్తలుChandrababu- KCR: కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్.. ప్లాన్ ఏంటో తెలుసా?

Chandrababu- KCR: కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్.. ప్లాన్ ఏంటో తెలుసా?

Chandrababu- KCR: తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి రిటర్న్‌ గిఫ్ట్‌లు రెడీ చేస్తున్నారు. ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ వ్యూహంలో చంద్రబాబు దిట్ట. ఎంత అనుభవం ఉన్నా.. ఎక్కడో ఒకదగ్గర తప్పు చేస్తారు. 2018 తెలంగాణ అసెంబ్లీ, 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అదే జరిగింది. వ్యూహాత్మక తప్పిదాలతో రెండు రాష్ట్రాల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న బాబు.. ఈసారి వ్యూహాత్మక తప్పిదాలు జరుగకుండా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన తెలంగాణ ముఖ్యమంత్రి, తన రాజకీయ శిష్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రిటర్ట్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఓటుకు నోటు కేసుద్వారా చంద్రబాబును రాత్రికి రాత్రే తెలంగాణ నుంచి పంపించిన కేసీఆర్, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బ కొట్టారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరింత ఘోరంగా ఓడించారు. ఇందుకు కేసీఆర్‌ వైసీపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడంతోపాటు ఆర్థిక సాయం కూడా చేశారని ప్రచారం జరిగింది.

దెబ్బకు దెబ్బ..
రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్‌ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న చంద్రబాబు ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలకు పదును పెడుతున్నారు. ఈ ఏడాది చివరన జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గిఫ్ట్‌ను తిరిగి ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ గిఫ్ట్‌ కూడా కేసీఆర్‌కు జీవితాంతం గుర్తుండిపోవాలని భావిస్తున్నారట. అలాంటి అస్త్రం బాబు రెడీ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏపీలో తనను మాజీ సీఎంను చేసిన కేసీఆర్‌ను తన వచ్చే ఎన్నికల్లో అదే చేయాలని చూస్తున్నారని సమాచారం.

శిష్యుడిపై బ్రహ్మాస్త్రం..
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు వద్ద రాజకీయ ఓనమాలు.. టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు రాజకీయ వ్యూహాలు నేర్చుకున్న తెలంగాణ ముఖ్యమంత్రిపై ఈసారి బ్రహ్మాస్త్రం ప్రయోగించాలని చంద్రబాబు ప్లాన్‌ సిద్ధం చేశారని సమాచారం. తనను రాజకీయంగా పల్టీ కొట్టించిన నాటినుంచి రగిలిపోతున్న బాబుకు ఇప్పుడు సమయం దొరికింది. ఈ ఏడాది చివరలో తెలంగాణాలో జరిగే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించడానికి బాబు ప్లాన్స్‌ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

కుదిరితో బీజేపీతో.. కుదరకపోతే కాంగ్రెస్‌తో..
ఇటీవల బీజేపీకి దగ్గరవుతున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కమనాథులతో కలిసి కేసీఆర్‌ను దెబ్బకొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించాలని చూస్తోంది. దక్షిణాదిన అధికారంలోకి వచ్చే రాష్ట్రంగా తెలంగాణను బీజేపీ ఇప్పటికే గుర్తించింది. ఈ నేపథ్యంలో టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకును బీజేపీకి జతచేసి కేసీఆర్‌పై ప్రయోగించాలని బాబు చూస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడిస్తే 2024లో ఏపీలోనూ తనకు అది లాభిస్తుందని బాబు భావిస్తున్నారు. అన్నీ కుదిరితే బీజేపీతో తెలంగాణ, ఏపీలో కలిపి పనిచేసే అవకాశం ఉంది. ఇక కుదరని పక్షంలో, టీడీపీని బీజేపీ దూరం పెట్టిన పక్షంలో ప్లాన్‌ బిలో భాగంగా ఈసారి కూడా 2018 తరహాలోనే తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిపి పోటీ చేయాలని బాబు భావిస్తున్నారు. ఎలాగైనా కేసీఆర్‌ను మాజీని చేయాలన్న లక్ష్యంతోనే బాబు ప్రస్తుతం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ఎన్నికలకు ఏడాది సమయం..
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈలోగా ఈ ఏడాది చివరన జరిగే తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టి వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీకి అడ్డంకి తొలగించాలని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడమే ప్రస్తుతం బాబు ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. కేసీఆర్‌ అధికారంలో ఉంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తనకు ఇబ్బందే అని బాబు భావిస్తున్నారు. అందుకే అటు బీజేపీకి, ఇటు టీడీపీకి లాభం కలిగే అస్త్రాన్ని చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. రిటర్న్‌ గిఫ్ట్‌ను అందుకోవడానికి కేసీఆర్‌ రెడీగా ఉన్నారా.. లేదా అనేది చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular