Tirupati: ఏపీలోని తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవడం జన్మధన్యంగా భావిస్తారు.ఎందుకంటే ఆ శ్రీవారు ఊరికే కనిపించడు. ఎంతో ప్రయాస పడితే గాని ఆ భాగ్యం కలగదు. తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకన్న వారి ఆనందం మాటల్లో చెప్పులేనంతగా ఉంటుంది. వారు ఏదో సాధించిన ఫీలింగ్ తో ఉంటుంది. ఎందుకంటే నిత్యం వేలాది మంది భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకుంటారు. ఎంతమంది భక్తులు ఉన్నాసరే.. ఎంత కష్టమైనా సరే శ్రీవారికి మొక్కలు అప్పజెప్పకుండా అక్కడి నుంని వెళ్లరు.
అయితే శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రణాళిక వేసుకోవడం ఎంతో ముఖ్యం అని అంటున్నారు. చాలా మంది తిరుపతి వెంకన్నస్వామిని శనివారం నాడు దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే సాధారణ భక్తుల వరకైతే ఓకే. కానీ పిల్లలు, వృద్ధులు ఉన్నవారికి ఈరోజు ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే చాలా ఇలాంటి వారు సాధారణ రోజుల్లో వెళ్లడం మంచిదని అంటున్నారు. ఏరోజు దర్శించుకున్నా దేవుడు ఆశీర్వదిస్తాడని కొందరు అంటున్నారు.
కొందరు ఉద్యోగులు తమ పిల్లలకు సెలవులు రాగానే తిరుపతి టూర్ కు ప్లాన్ వేస్తారు. కానీ ఇదే సమయంలో ఉపాధ్యాయులు, ఇతర హాలిడేస్ ఉన్నవారు వెంకన్న స్వామి దర్శనానికి వస్తారు. ఇలా భక్తులు ఒక్కసారి రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోతాయి. అయితే దేవుడిని ప్రశాంతంగా దర్శించుకుంటేనే ఎంతో సౌభాగ్యం కలుగుతుందని కొందరు నమ్ముతారు. వారు చెబుతున్న ప్రకారం.. సాధారణ ఉద్యోగులు హాలీడేస్ ఉన్న రోజు కాకుండా సాధారణ రోజుల్లో ప్లాన్ వేసుకోవడం మంచిది.
ఇక తప్పదు అనుకునే వారికి సైతం కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుం టీటీడీ అనేక ఏర్పాట్లు చేసింది. క్యూలైన్ కాంప్లెక్స్ లో భక్తుల కోసం పాలు.. మజ్జిగ.. కిచిడి.. ఉప్మా.. సాంబార్ రైస్ ను అందుబాటులో ఉంచింది. అలాగే పెరుగన్నం.. సుండల్, తాగునీటిని ఏర్పాటు చేసింది. సామాన్య భక్తుల కోసం శ్రీనివాసం, విష్ణునివాసం సత్రాల్లో ఉండొచ్చు. వీటితో పాటు దర్శన సమయాలు, తదితర పూర్తి విషయాలు అవగాహన చేసుకున్న తరువాత టూర్ ప్లాన్ వేస్తు బాగుంటుందని అంటున్నారు.