బీజేపీపై బాబు ఆశలు గల్లంతేనా?

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చూస్తుంటే బీజేపీ పొత్తుపై బాబు పెట్టుకున్న ఆశలు గల్లంతైనట్లేనని అనిపిస్తోంది. ఏపీలో 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం చవిచూసింది. ఇప్పటికే ఆ ఓటమి నుంచి టీడీపీ కోలుకోవడం లేదు. ఇక 2019లో టీడీపీ ఓటమిగల కారణాలు బాబు ఇప్పటికీ అర్థం కావడం లేదు. దీంతో ఆయన 2014 ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చేన పార్టీలతోనే 2024ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన బాబు ఆ పార్టీకి […]

Written By: Neelambaram, Updated On : July 28, 2020 11:55 am
Follow us on


ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చూస్తుంటే బీజేపీ పొత్తుపై బాబు పెట్టుకున్న ఆశలు గల్లంతైనట్లేనని అనిపిస్తోంది. ఏపీలో 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం చవిచూసింది. ఇప్పటికే ఆ ఓటమి నుంచి టీడీపీ కోలుకోవడం లేదు. ఇక 2019లో టీడీపీ ఓటమిగల కారణాలు బాబు ఇప్పటికీ అర్థం కావడం లేదు. దీంతో ఆయన 2014 ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చేన పార్టీలతోనే 2024ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన బాబు ఆ పార్టీకి హ్యండిచ్చారు. బీజేపీ పార్టీతో పొత్తు కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read: తొందరపడిన బాబు బకరా అయ్యారే..!

అయితే బాబు ఆశలు మాత్రం ఫలించేలా కన్పించడం లేదు. బీజేపీ అధిష్టానం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకు కట్టబెట్టింది. బాబు పేరుచెబితేనే ఇంతెత్తున లేచే వీర్రాజును అధ్యక్ష పదవీ అప్పగించడం ద్వారా బాబుకు ఆశలకు చెక్ పెట్టేసింది. ప్రస్తుతం బాబుకు బీజేపీ అవసరంగానీ.. బీజేపీకి బాబు అవసరం లేదని ఆ పార్టీ అధిష్టానం అభిప్రాయపడుతోంది. వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అయ్యాక కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి పలు డిమాండ్లను విన్పిస్తూనే మాజీ సీఎం చంద్రబాబు అవినీతిని సైతం బయటికి తీయాలని కోరుతున్నాడు. బీజేపీ ఫైర్ బ్రాండ్ వీర్రాజుతో బాబు మరింత ఇరకాటంలో పడటం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు హయాంలో టీడీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి గెలిచిన దాఖలు లేవు. దీంతో ఎలాగోలా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తు పెట్టుకొని మోదీ చర్మిష్మాతో గట్టెక్కాలని బాబు ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ చంద్రబాబుకు డోర్లు మూసివేయం.. మరోవైపు బాబు ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక కాంగ్రెస్ కు హ్యండివ్వడంతో ప్రస్తుతం బాబు జాతీయ స్థాయిలో, ఏపీలోనూ రెండింటికి చెడ్డ రేవడిలా మారిపోయారు. బాబు ఏ ఎండకు ఆ గొడుగు పడుతారనే విషయం మరోసారి రుజువుకావడంతో ఆపార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు.

Also Read: జిల్లాల విభజన.. సందిగ్ధంలో వైసీపీ నేత?

అయితే బాబు మాత్రం బీజేపీ పొత్తుకోసం వెంపర్లాడుతున్నాడు. టీడీపీ చెందిన సీనియర్ నేతలు ఇప్పటికే బీజేపీలో కీలక స్థానాల్లో ఉండటంతో వారిసాయంతో వచ్చే ఎన్నికల నాటికి ఆపార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం బాబు పేరుచెబితేనే మండిపడుతున్నారు. బీజేపీ సైతం ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ఆలోచిస్తుండటంతో బాబుకు ఆశలు గల్లంతేననే టాక్ విన్పిస్తుంది. ఏపీలో తాజా పరిణమాలన్నీ బాబుకు వ్యతిరేకంగా మారుతున్నారు. దీంతో చంద్రబాబు టీడీపీని ఏవిధంగా గాడిలో పెడుతారనే ఆసక్తి నెలకొంది.