జగన్‌ ఎత్తులకు చంద్రబాబు పైఎత్తులు

ఎవరినీ ఎలా పార్టీలోకి లాగాలి.. ఏం చేస్తే పార్టీలోకి వస్తారో చాలా మంది లీడర్లు రాజకీయ చదరంగం ఆడుతుంటారు. వారిని డైరెక్టుగా తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించకుండా.. ఆటోమెటిక్‌గా తమ పార్టీలోకి వచ్చి చేరేలా పరిస్థితులు తెస్తారు. ఇంచుమించు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా అలానే చేస్తుంటారు. ఆ సీన్‌ను క్రియేట్ చేస్తుంటారు. దీంతో చాలా మంది టీడీపీ నేతలు ఆహ్వానం లేకుండానే వచ్చి వైసీపీ గూటికి చేరుతున్నారు. అయితే.. అది కూడా జగన్‌ ఆశించిన స్థాయిలో […]

Written By: NARESH, Updated On : November 2, 2020 12:42 pm
Follow us on

ఎవరినీ ఎలా పార్టీలోకి లాగాలి.. ఏం చేస్తే పార్టీలోకి వస్తారో చాలా మంది లీడర్లు రాజకీయ చదరంగం ఆడుతుంటారు. వారిని డైరెక్టుగా తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించకుండా.. ఆటోమెటిక్‌గా తమ పార్టీలోకి వచ్చి చేరేలా పరిస్థితులు తెస్తారు. ఇంచుమించు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా అలానే చేస్తుంటారు. ఆ సీన్‌ను క్రియేట్ చేస్తుంటారు. దీంతో చాలా మంది టీడీపీ నేతలు ఆహ్వానం లేకుండానే వచ్చి వైసీపీ గూటికి చేరుతున్నారు. అయితే.. అది కూడా జగన్‌ ఆశించిన స్థాయిలో జరగడం లేదనేది తెలుస్తోంది.

Also Read: చంద్రబాబు ఈసారి కొత్తప్లాన్ వేస్తున్నాడట..

జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. ముందుగా ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేశారు. ఎమ్మెల్యేలు తగినంత మంది వస్తే టీడీపీ శాసనసభపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనతో తొలినాళ్లలో అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ జగన్ ఆలోచనకు అనుగుణంగా ప్లాన్ వర్కవుట్ కాలేదు.

వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ మాత్రమే వైసీపీకి మద్దతుగా నిలిచారు. అంటే 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురు మాత్రమే వైసీపీ వైపు మళ్లారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్లు కూడా వినిపించాయి. గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ కంపెనీలపై కూడా దాడులు జరిపి భారీగా జరిమానాలు విధించారు. అయినా హైకోర్టుకు వెళ్లి వ్యాపారాలను రక్షించుకున్నారే తప్ప వైసీపీ వైపు రాలేదు. ఏలూరి సాంబశివరావు పరిస్థితి కూడా అంతే. ఇక పార్టీలోకి వచ్చే వాళ్లలో గంటా శ్రీనివాసరావు పేరు ఒక్కటే వినిపిస్తోంది. అయితే ఆయన రాకకు అనేక ఇబ్బందులు ఉండటంతో ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లుగా సమాచారం.

Also Read: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వాళ్లకు రూ. 10 వేలు జమ..!

మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేరు కూడా వైసీపీలో చేరుతారని ప్రచారం బాగా జరుగుతోంది. కానీ ఆయన రాకకు కూడా బ్రేకులు పడ్డాయని చెబుతున్నారు. మొత్తం మీద.. జగన్‌ ఎత్తులకు చంద్రబాబు పైఎత్తులు వేస్తూ తన పార్టీని కాపాడుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదాను లేకుండా చేయాలనే జగన్‌ ఆలోచన ఇప్పట్లో నెరవేరేలా కూడా కనిపించడం లేదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్