Chandrababu-BJP: సుదీర్ఘ విరామం తరువాత చంద్రబాబు కల ఫలించింది. ఎన్నికల జరిగిన మూడేళ్ల అనంతరం ఆయన బీజేపీ నేతలతో వేదిక పంచుకోలగిగారు. ఇందుకు ఎన్టీఏ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రూపంలో అవకాశం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో సానుకూల వాతావరణం ఏర్పడింది. తనకు మద్దతు తెలుపుతున్న అన్ని రాజకీయ పక్షాల నేతలు, ప్రజాప్రతినిధులకు ద్రౌపది ముర్ము వ్యక్తిగతంగా కలుస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఏపీ సీఎం జగన్ తో పాటు విపక్ష నేత చంద్రబాబును ఆమె కలిశారు. ముందుగా సీఎం జగన్ నివాసానికి వెళ్లిన ముర్ము వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. అనంతరం ఓ కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ ప్రజా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు మద్దతు ప్రకటించినందుకు దన్యావాదాలు తెలిపారు.

అందరి దృష్టి అటువైపే..
అటు తరువాత టీడీపీ ఓ హోటల్ లో ఏర్పాటుచేసిన సమావేశానికి సైతం హాజరయ్యారు. అక్కడ 20 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కలుసుకున్నారు. అప్పటికే అక్కడ చంద్రబాబుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఉన్నారు. అయితే వైసీపీ ప్రజాప్రతినిధుల సమావేశం కంటే టీడీపీ సమావేశం వైపే అందరూ ఆసక్తిగా చూశారు. గత ఎన్నికల నాటి నుంచి బీజేపీ ప్రాపకం కోసం చంద్రబాబు చేయని ప్రయత్నాలంటూ లేవు. కానీ గత అనుభవాల దృష్ట్యా బీజేపీ పెద్దలు దూరం పెంచుతూ వచ్చారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల వేళ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. దీంతో బీజేపీ పెద్దలు కొంత మనసు మార్చుకున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read: Avoid Eating Pani Puri: డేంజర్: పానీపూరిని ఎందుకు తినొద్దంటున్నారు..?
ఆసక్తికర పరిణామాలు..
అయితే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముతో పాటు బీజేపీ నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకోవడం ముందు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సామాజిక న్యాయం దృష్ట్యా ద్రౌపది ముర్ముకు మద్దతు తెలుపుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేశారు. దన్యవాదాలు తెలిపారు. అయితే ఒకసారి ద్రౌపది ముర్ముగారితో సమావేశం ఏర్పాటుచేయాలని చంద్రబాబు కోరారట. దీనికి సమ్మతించిన అమిత్ షా ఆమె వచ్చి నేరుగా కలుస్తారని బదులిచ్చారట. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారట. అయితే ముందుగా అమరావతిలోని జగన్ నివాసానికి వెళ్లిన వరకు ద్రౌపది ముర్ము టీడీపీ అధినేత చంద్రబాబును కలుస్తారని వైసీపీ నేతలకు తెలియలేదన్న టాక్ నడుస్తోంది. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణలో జరిగిన తప్పిదాలు మరోసారి చోటుచేసుకోకుండా కేంద్ర పెద్దలు జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ నేతలను కలువకుండా వైసీపీ నేతలు చివరివరకూ అడ్డుకునే ప్రయత్నం చేశారని.. కానీ కేంద్ర పెద్దలు పట్టించుకోలేదన్న ప్రచారం కూడా ఉంది. ఎలాగైతేనేం చంద్రబాబు అనుకున్నట్టు అయ్యింది.

చంద్రబాబు ఖుషీ..
నేరుగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర పెద్దలు రావడంతో చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇదో సానుకూల పరిణామంగా చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. సామాజిక న్యాయం చేశారని.. తొలి గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎంపిక చేసిన ఘనతను దక్కించుకున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహం చంద్రబాబుతో మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని సైతం అడిగి తెలుసుకున్నారు. సామాజిక న్యాయంలో భాగంగా గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశమిచ్చిన కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దన్యవాదాలు తెలిపారు. భాగస్వామ్యం కల్పించినందుకు ప్రధాని మోదీకి సైతం అభినందలతో ముంచెత్తారు. మొత్తానికి అయితే నిన్నటి ఎపిసోడ్ తో వైసీపీలో కాస్తా కలవరం ప్రారంభమైంది.
[…] […]