Milky Sea: మన హిందూ దేవుడు పాలసముద్రంపై పయనించాడని పురాణాల్లో ఉంది. అయితే పాలసముద్రం కేవలం ఇతిహాసాల్లోనేనని.. భూమిపై, ఆకాశంలో లేదని కొందరు చెబుతుంటారు.కానీ అలాంటి అద్భుతమే తాజాగా శాటిలైట్ చిత్రాల్లో ఆవిష్కృతమైంది. దక్షిణ ఇండోనేషియాలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. శాటిలైట్ చిత్రాల్లో ‘పాల సముద్రం’ ఉన్నట్లుగా గుర్తించింది. పాల సముద్రం అనేది మన ఊహ కాదని.. నిజంగానే ఉందని రుజువైంది.

పాలసముద్రం ఏర్పడడానికి ఒక బ్యాక్టీరియా కారణమని తెలుస్తోంది.‘ల్యూమినస్’ బ్యాక్టీరియా కారణంగా నీళ్లలో మెరుపు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా పరిశోధకుల బఈందం 2019 ఆగస్టులో ఈ పాలసముద్రం గురించి పరిశోధన చేశారు. ఆ సమయంలో విశ్వంలో ఒకటో రెండు సార్లు ఈ పాలసముద్రాన్ని చూడగలమని పేర్కొన్నారు.
బయోల్యూనెసెంట్ బ్యాక్టీరియా కారణంగా పాల సముద్రాలు ఏర్పడుతాయి. ఈ బ్యాక్టీరియా ఒక దానితో మరొకటి కమ్యూనికేట్ అవుతుంటాయి. అలా సముద్ర వాతావరణ పరిస్థితుల కారణంగా మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.
గతంలోనూ చాలా మంది సిబ్బంది రాత్రి సమయాల్లో మెరవడం చూశామని.. కానీ శాస్త్రీయంగా పరిశోధిస్తే పాల సముద్రాలు అరుదుగా ప్రకృతి కారణంగానే ఏర్పడుతాయని తెలిసింది.
ఒక బ్యాక్టీరియా కారణంగా సముద్రం పాలరంగును సంతరించుకోవడం.. ఏర్పడడం అరుదుగా చెప్పొచ్చు. అలాంటి వింత ఈ భూమిపై కనిపించడం విశేషంగా చెప్పొచ్చు.