Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇటీవల చిత్తూరు జిల్లా నగరి లో తలెత్తిన విభేదాలు బహిరంగంగా అందరిలో అనుమానాలు కలిగించాయి. అదే కోవలో రాష్ర్టంలోని మిగతా ప్రాంతాల్లో కూడా వైసీపీ నేతల్లో అభిప్రాయ భేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రతిష్ట మసకబారుతోందని చెబుతున్నారు. దీంతో పార్టీ రాబోయే ఎన్నికల్లో మరింత కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక టీడీపీకి ఇదంతా ప్లస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు బంగారు పళ్లెంలో పెట్టి అధికారం అందిస్తారనే వాదనలు వస్తున్నాయి. దీంతో బాబు కష్టపడినా కష్టపడకపోయినా అధికారం దానంతట అదే వస్తుందని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల వరకు విభేదాలు మరింత ముదిరుతాయని భావిస్తున్నారు. అన్ని చోట్ల రెండు వర్గాలు ఏర్పడుతున్నాయని తెలుస్తోంది.
Also Read: జనసేన కోసం టీడీపీ నేతల సీట్లు మారుస్తున్న చంద్రబాబు?
అదే రాబోయే రోజుల్లో మరింత దిగజారి అధికారం కోల్పోయే వీలున్నట్లు చెబుతున్నారు. దీనిపై అధిష్టానం కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకునే విధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది.
Also Read: మంగళగిరిలో సీన్ మారుతోందా.. లోకేష్ ఈ సారి గట్టెక్కుతారా..?
దీంతో రాష్ర్టంలో వైసీపీలో వర్గ విభేదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. నేతల్లో ఐక్యతా రాగం లోపిస్తోంది. ఫలితంగా రోజురోజుకు తారతమ్యాలు ఎక్కువవుతున్నాయి. గత నాలుగేళ్లుగా ప్లీనరీ నిర్వహించిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. దీంతో నేతల్లో ఐక్యత కనుమరుగవుతోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.