https://oktelugu.com/

Chiranjeevi: ‘నాకే ఇంత ఆనందం ఉంటే.. రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి’- మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్​ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమా షూటింగ్​ల్లో ఫుల్​ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న ఆయన.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఖాలీ సమయం దొరికితే చాలు.. తనుఏదో పనిలో పడిపోయి.. దాని ప్రతిఫలంతో సంతోషిస్తుంటారు. తాజాగా, ఇన్​స్టాగ్రామ్​ వేదికగా జాతీయ రైతు దినోత్సవాన్ని పురష్కరించుకుని.. ఓ వీడియో షేర్ చేశారు చిరు. ప్రస్తుతం ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 24, 2021 / 03:06 PM IST
    Follow us on

    Chiranjeevi: మెగాస్టార్​ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమా షూటింగ్​ల్లో ఫుల్​ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న ఆయన.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఖాలీ సమయం దొరికితే చాలు.. తనుఏదో పనిలో పడిపోయి.. దాని ప్రతిఫలంతో సంతోషిస్తుంటారు. తాజాగా, ఇన్​స్టాగ్రామ్​ వేదికగా జాతీయ రైతు దినోత్సవాన్ని పురష్కరించుకుని.. ఓ వీడియో షేర్ చేశారు చిరు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

    ఆ వీడియోలో.. ఇలా అన్నారు.. ఓ రైతు తన పంట చేతికొచ్చిప్పుడు వాటిని ఇంటికి తీసుకెళ్లే ముందు ఎంత ఆనందిస్తాడో.. అందులో ఎంతో కొంత ఆనందాన్ని  ఇప్పుడు నేను అనుభవిస్తున్నా. కొన్ని నెలల కిందట మా పెరట్లో ఓ సొరకాయ గింజను నాటా. ఇప్పుడు అది బాగా ఏపుగా పెరిగి రెండు కాయలు కాశాయి. వాటిని ఈ రోజు కోస్తున్నా. మా పెరట్లో అనపకాయ కాస్తేనే ఇంత ఆనందంగా ఉంటే.. మట్టితో సావాసం చేసి.. పంట పండించి, మనందరికి అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి. అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మన కడుపు నింపుతున్న ప్రతి ఒక్క రైతుకు సెల్యూట్​ అంటూ చెప్పుకొచ్చారు.

    చిరు వీడియోపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించారు. మీరు ఇలాగే మాలో ఎప్పుడూ స్ఫూర్తి నింపుతూ ఉండాలని కామెంట్లు చేశారు. ఇక ప్రస్తుతం ఆచార్యతో పాటు, మెహర్​రాజా లూసిఫర్​ రీమేక్​తో బిజిగా ఉన్నారు చిరు. మరోవైపు మెహర్​ రమేశ్​ వేదాళ రీమేక్​తో పాటు.. బాబితో మరో ప్రాజెక్టుకు కూడా సైన్ చేశాడు.