https://oktelugu.com/

‘తిమ్మరసు’గా మారిన సత్యదేవ్.?

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధపడుతున్నాడు. కెరీర్ తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ‘సత్యదేవ్ మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఆ తర్వాత ‘జ్యోతిలక్ష్మీ’లో ఛార్మి భర్త నటించిన సత్యదేవ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జ్యోతిలక్ష్మీ’ హిట్టు తర్వాత సత్యదేవ్ పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ బీజీగా మారాడు. సత్యదేవ్ ‘బ్లఫ్‌ మాస్టర్‌’.. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన కథా చిత్రాల్లో నటించి అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈక్రమంలోనే సత్యదేవ్ ‘తిమ్మరసు’ అనే మరో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2020 / 10:49 AM IST
    Follow us on

    టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధపడుతున్నాడు. కెరీర్ తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ‘సత్యదేవ్ మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఆ తర్వాత ‘జ్యోతిలక్ష్మీ’లో ఛార్మి భర్త నటించిన సత్యదేవ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జ్యోతిలక్ష్మీ’ హిట్టు తర్వాత సత్యదేవ్ పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ బీజీగా మారాడు.

    సత్యదేవ్ ‘బ్లఫ్‌ మాస్టర్‌’.. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన కథా చిత్రాల్లో నటించి అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈక్రమంలోనే సత్యదేవ్ ‘తిమ్మరసు’ అనే మరో ఢిఫరెంట్ మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ తాజాగా హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. తిమ్మరసు మూవీకి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు.

    సత్యదేవ్ గత చిత్రాల మాదిరిగానే ‘తిమ్మరసు’ మూవీ కూడా డిఫరెంట్ కాన్సెస్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘అసైన్మెంట్ వాలి’ అనే ట్యాగ్ లైన్ తో ‘తిమ్మరసు’ సినిమా రాబోతుంది. ఈ మూవీకి రాజా, వేదవ్యాస్ స్రీప్ట్ అందిస్తున్నారు. తిమ్మరసు మూవీని ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌.. ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌ నిర్మాత సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    మూవీ ప్రారంభం సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సత్యదేవ్ తో మూవీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ‘తిమ్మరుసు’ మూవీ ప్రేక్షకుల కనెక్ట్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీ సత్యదేవ్‌లోని మరో  కోణాన్ని బయటికి తీసుకొస్తుందన్నారు. ఈనెల 21నుంచి ‘తిమ్మరసు’ రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.