
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు అనేది నిజం. దీన్ని ఒంటబట్టించుకున్న వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయనకు రాజకీయ చాణక్యుడు అనే పేరు కూడా ఉంది. ఆలోచనలు అమలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రత్యర్థులను సైతం పల్టీ కొట్టించగల సత్తా ఆయన సొంతమని తెలుసు. అలాంటి పేరున్న చంద్రబాబు ఈ మధ్య విచిత్ర పరస్థితిని ఎదుర్కొంటున్నారు. పార్టీని సరైన మార్గంలో నడపలేకపోతున్నారు. పార్టీకి విజయం దక్కడం కలేనా అనే భ్రమలోనే కొట్టుమిట్టాడుతున్నారు
దీంతో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో పడిపోయారు. ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిలో వైసీపీని ఎదుర్కోవడం కష్టమే అని తెలిసిపోతోంది. అందుకే పొత్తులకు సై అంటున్నారు. కానీ ఏ పార్టీలతో కలవాలనే విషయంలో తేల్చుకోలేకపోతున్నారు. ఓ వైపు దేశంలో థర్డ్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు ప్రాంతీయ పార్టీలు ముందుకు వస్తుంటే టీడీపీ మాత్రం ఏం చేయాలనే ఆలోచనలోనే పడిపోయింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో జత కట్టాలని భావిస్తున్నా గతంలో ఇలా చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనే ఆలోచనలో పడింది. దేశంలో బీజేపీ గాలి వీస్తున్న సందర్భంలో కాంగ్రెస్ తో జతకడితే మొదటికే మోసం వస్తుందనే మీమాంసలో పడిపోయారు. కానీ ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని తమ పార్టీ మనుగడ సాధించాలంటే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నరు. సాధ్యమైనంత వరకు పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నరు.
ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు శైలజానాథ్ కుమారుడి పెళ్లికి హాజరయి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మధ్య ఏ కార్యక్రమానికైనా లోకేష్ ను పంపే బాబు ఈ పెళ్లికి మాత్రం తను వెళ్లడంతో పార్టీలో చర్చనీయాంశం అయింది. గతంలో హరికృష్ణ చనిపోయినప్పుడు టీఆర్ఎస్ నేతలు పరామర్శకు వస్తే అక్కడే వారితో రాజకీయాలు మాల్లాడి అవాసుపాలయ్యారు. అయినా ఆయన అనుకున్నది చేయడంలో దిట్ట. ప్రణాళికలు రచించడంలోో నేర్పరి అనే పేరుంది. అలాంటి బాబు శైలజానాథ్ కుమారుడి పెళ్లికి హాజరు కావడంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే విషయం అందరిలో నెలకొంది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు బాబు అనుచరుడే అయినందున శైలజనాథ్ ను మచ్చిక చేసుకుంటే కాంగ్రెస్ కు దగ్గర కావచ్చనే ఆలోచనలో బాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బాబు మదిలో ఏముందో అనే విషయంపై పార్టీ కార్యకర్తల్లో చర్చనీయాంశం అవుతోంది. మొత్తానికి బాబు కాంగ్రెస్ తో కలవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయం అందరికి అర్థమైపోతోంది.