Chandrababu Vs Jagan: ఒక రాష్ట్రలలో ఉద్యోగావకాశాలు పెరిగాయా తగ్గాయా, నిరుద్యోగ రేటు ఎలా ఉందో తెలియాలంటే.. ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు చెబుతాయి. ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి. ఎన్ని జాబ్‌లకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి.. ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనే వివరాల ఆధారంగా నిరుద్యోగ రేటు తెలుస్తుంది.
ఏపీలో ఇలా…
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఉద్యోగ నియామకాలపై చర్చ జరుగుతోంది. ఎవరి పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్న అంశంపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్ సంస్థలు నివేదికలు మాత్రం వైసీపీ పాలనలోనే నియామకాలు ఎక్కువగా జరిగాయని చెబుతోంది. అయితే టీడీపీ ఉద్యోగాలు ఇవ్వలేదా అంటే.. ఆ విషయం కూడా తెలిపింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సర్కార్ 35 వేల ఉద్యోగ నియామకాలు చేసింది. ఇక 2019 నుంచి అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటికే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇది ఎవరు ఔనన్నా.. కాదన్నా వాస్తవం.
ప్రైవేటు ఉద్యోగాల్లోనూ..
ఇక ప్రైవేటు ఉద్యోగాల్లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉందట. ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రావిడెంట్ ఫండ్ సంస్థ చెబుతోంది. ఈపీఎఫ్‌లో రిజిస్టర్ అయి ఉన్న కంపెనీల్లో జాయిన్ అయిన ప్రతీ ఉద్యోగికి ఈపీఎఫ్‌ఓలో ఖాతా తెరుస్తుంది. వీటి ఆధారంగానే ప్రైవేటులో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుంది. జగన్ సర్కార్ కొలువుదీన తర్వాత 16 లక్షల మందికి ప్రైవేటులో కొత్తగా ఉద్యోగాలు వచ్చాయట. 2019–19 నాటికి ఈపీఎఫ్ ఖాతాలు ఏపీలో 45 లక్షలు ఉన్నాయి. 2022–23లో నాటికి ఈ ఖాతాల సంఖ్య 61 లక్షలకు చేరింది. అంటే చంద్రబాబు దిగిపోయేనాటికి 45 లక్షల ఖాతాలు ఉండగా, జగన్ వచ్చిన తర్వాత 61 లక్షలకు పెరిగాయి. ఈ లెక్కన జగన్ ప్రభుత్వం వచ్చాక 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయని ఈపీఎఫ్ చెబుతోంది. అంటే 35 శాతం ఈపీఎఫ్ ఖాతాలు పెరిగాయి. ఇక తమిళనాడులో ఐదేళ్లలో 31 శాతం, కర్ణాటకలో 32 శాతం, పుదుచ్చేరిలో 28 శాతం ఈపీఎఫ్ ఖాతాలు పెరిగాయి. ఈలెక్కన చూస్తే ఏపీలో 35 శాతం పెరిగాయి. దేశంలో అన్నిటికంటే మెరుగ్గా ఏపీలో ఉద్యోగాలు ఉన్నాయని ఈపీఎఫ్‌వో చెబుతోంది.
జాతీయస్థాయిలోనూ సంతృప్తికరంగా..
ఇక జాతీయ స్థాయిలో 30.38 శాతం ఈపీఎఫ్ ఖాతాలు పెరిగాయి. అంటే దేశంలో కూడా కొత్తవాళ్లకు చాలా మందికి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు లభించాయన్నమాట. 2018–19 నాటికి దేశంలో ఈపీఎఫ్ ఖాతాలు 23 కోట్లు ఉండగా, 2022–23 నాటికి ఆ ఖాతాల సంఖ్య 30 కోట్లకు పెరిగింది. అంటే నాలుగేళ్లలో 7 కోట్ల మందికి కొత్తగా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు వచ్చాయన్నమాట.