https://oktelugu.com/

Chandra Babu Unstoppable : అన్ స్టాపబుల్ తో పాత గాయాల్ని రేపిన చంద్రబాబు

Chandra Babu Unstoppable : చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది. ఆ ఆకులు కాల్చుకొని మరీ చంద్రబాబు ఇప్పుడు మీదేసుకున్నారు. ఎప్పుడో 1995లో అందరూ మరిచిన ఎన్టీఆర్ వెన్నుపోటు చరిత్రను కెలికి మరీ చంద్రబాబు తనను తానే విలన్ ను చేసుకున్నారు. హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 ప్రారంభమైంది. ఈసారి తొలి గెస్ట్ గా ఆయన బావ, మాజీ సీఎం చంద్రబాబు హాజరు కావడంతో ఇది వైరల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2022 / 09:27 PM IST
    Follow us on

    Chandra Babu Unstoppable : చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది. ఆ ఆకులు కాల్చుకొని మరీ చంద్రబాబు ఇప్పుడు మీదేసుకున్నారు. ఎప్పుడో 1995లో అందరూ మరిచిన ఎన్టీఆర్ వెన్నుపోటు చరిత్రను కెలికి మరీ చంద్రబాబు తనను తానే విలన్ ను చేసుకున్నారు.

    హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 ప్రారంభమైంది. ఈసారి తొలి గెస్ట్ గా ఆయన బావ, మాజీ సీఎం చంద్రబాబు హాజరు కావడంతో ఇది వైరల్ అవుతోంది. చంద్రబాబు-బాలకృష్ణకు మధ్య జరిగిన 1995 ఘటనకు సంబంధించిన సంభాషణ చర్చనీయాంశమైంది.

    1995లో ఎన్టీఆర్ ను గద్దెదించి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అధికారం హస్తగతం చేసుకున్నారు. ఈ అన్ స్టాపబుల్ షోలో 1995 సంఘటనను అనవసరంగా కెలుక్కొని మరీ చంద్రబాబు అభాసుపాలయ్యారని చెప్పొచ్చు. అందరూ మరిచిపోయిన దాన్ని మళ్లీ ప్రస్తావించుకొని చంద్రబాబు తన గొయ్యి తానే తవ్వుకున్నారని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అభిమానులు ఎవ్వరూ కూడా చంద్రబాబు ఆరోజు చేసిన పనిని అస్సలు హర్షించరు.

    రాజకీయల లబ్ధిలు , ఈనాడు ప్రచారాన్ని పక్కనపెడితే.. తాను ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని బతిమిలాడినా ఒప్పుకోలేదని.. అందుకే దించేశామని.. ఎన్టీఆర్ పై చెప్పులు వేయిస్తారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

    రాజకీయంగా చూసుకుంటే 1995 ఎన్నికల్లో ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొనే చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు గెలిచారు. లక్ష్మీపార్వతిని భార్యగా చేసుకునే ఎన్టీఆర్ ఎన్నికలకు వెళ్లి గెలిచారు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. దీన్ని చంద్రబాబు ఎవరు కాదనడానికి అన్నది ప్రశ్న.. ఆరోజు అబ్జక్షన్ పెట్టని చంద్రబాబు గెలిచాక ఇలా కుట్రలు చేయడం తగనా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

    చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచిన చరిత్రను ఎలా సమర్థించుకుంటున్నారన్నది అర్థంకాకుండా ఉంది. ఎన్టీఆర్ కు తీరని అన్యాయం చేసిన చంద్రబాబు మళ్లీ పాత గాయాల్ని రేపి మరీ తన గొయ్య తానే తవ్వుకున్నారని చెప్పొచ్చు. అన్ స్టాపబుల్ షో, చంద్రబాబు మాటలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.