https://oktelugu.com/

TRS BJP: మునుగోడు వేళ టీఆర్ఎస్ కు భారీ షాక్.. బీజేపీలోకి మాజీ ఎంపీ?

TRS BJP: మునుగోడు ఉప ఎన్నికల వేళ అధికారి టీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్ నేత బీజేపీలోకి చేరిపోయారు. తెలంగాణ ఉద్యమకారుడిగా కదంతొక్కి.. తొలి తెలంగాణ ప్రభుత్వంలో భువనగిరి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్ అనూహ్యంగా టీఆర్ఎస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలిసింది. ఢిల్లీకి వెళ్లిన బూర నర్సయ్య గౌడ్ ఈరోజు బీజేపీ పెద్దలను కలిసి చర్చలు జరిపారు. అనంతరం బీజేపీలో చేరే అవకాశం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2022 / 07:35 PM IST
    Follow us on

    TRS BJP: మునుగోడు ఉప ఎన్నికల వేళ అధికారి టీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్ నేత బీజేపీలోకి చేరిపోయారు. తెలంగాణ ఉద్యమకారుడిగా కదంతొక్కి.. తొలి తెలంగాణ ప్రభుత్వంలో భువనగిరి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్ అనూహ్యంగా టీఆర్ఎస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలిసింది.

    ఢిల్లీకి వెళ్లిన బూర నర్సయ్య గౌడ్ ఈరోజు బీజేపీ పెద్దలను కలిసి చర్చలు జరిపారు. అనంతరం బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బూర అసంతృప్తికి

    టిఆర్ఎస్ లో మునుగోడు సీటును బూర నర్సయ్య గౌడ్ ఆశించారు. చివరి వరకూ ఆ సీటు కోసం ట్రై చేశాడు. కానీ కేసీఆర్ మాత్రం అక్కడి టీఆర్ఎస్ ఇన్ చార్జి ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఇచ్చారు. ఆయనకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిసినా కూడా టికెట్ ఇవ్వడం.. తనకు నిరాకరించడంపై బూర నొచ్చుకున్నట్టు తెలుస్తోంది.

    ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లిన బూర నర్సయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తరుణ్ చుగ్ తో భేటీ అయినట్లు సమాచారం. త్వరలోనే బీజేపీలో చేరికకు ముహూర్తం సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

    బూర నర్సయ్య గౌడ్ 2014లో టీఆర్ఎస్ తరుఫున భువనగిరి ఎంపీగా గెలిచాడు. 2019లోనూ ఇదే సీటుపై పోటీచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మునుగోడు సీటును ఆశించి భంగపడి టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడానికి డిసైడ్ అయ్యారు.