https://oktelugu.com/

బాబుకు దొరికిందో పవర్ ఫుల్ పాయింట్?

కరోనా ఉధృతి పెరిగిన నేపథ్యంలో ప్రతిపక్షాలకు మంచి టాపిక్ దొరికింది. వీలు దొరికినప్పుడల్లా విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా వేళ పట్టుకోవడానికి చంద్రబాబుకు పాయింట్ లేక సతమతమవుతున్న తరుణంలో ఎఢారిలో బిస్లరీ వాటర్ దొరికినట్లుగా బాబుకు ఓ హాట్ టాపిక్ దొరికింది. కరోనా పెరుగుతున్న వేళ దాన్ని కట్టడి చేయడానికి జగన్ సర్కారు రూ.500 కోట్లు కేటాయించింది. దీంతో బాబు మండిపడుతున్నారు. ప్రభుత్వంపై ఒంటికాలు మీద లేస్తున్నారు. కరోనా నిర్మూలనకు ఆ బడ్జెట్ దేనికి సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 23, 2021 6:23 pm
    Follow us on

    Chandrababu Naiduకరోనా ఉధృతి పెరిగిన నేపథ్యంలో ప్రతిపక్షాలకు మంచి టాపిక్ దొరికింది. వీలు దొరికినప్పుడల్లా విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా వేళ పట్టుకోవడానికి చంద్రబాబుకు పాయింట్ లేక సతమతమవుతున్న తరుణంలో ఎఢారిలో బిస్లరీ వాటర్ దొరికినట్లుగా బాబుకు ఓ హాట్ టాపిక్ దొరికింది. కరోనా పెరుగుతున్న వేళ దాన్ని కట్టడి చేయడానికి జగన్ సర్కారు రూ.500 కోట్లు కేటాయించింది. దీంతో బాబు మండిపడుతున్నారు. ప్రభుత్వంపై ఒంటికాలు మీద లేస్తున్నారు. కరోనా నిర్మూలనకు ఆ బడ్జెట్ దేనికి సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తున్నారు.

    చంద్రబాబు పట్టుకున్న పాయింట్ పై ప్రతిపక్షాలు సైతం అదే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నాయి. వ్యాక్సినేషన్ కు అవసరమైన టీకాలు చంద్రబాబు ఇస్తారా అంటూ అధికార పక్షం సైతం ఎధురుదాడి చేస్తోంది. కరోనా నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బాబు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో కరోనా టాపిక్ రెండు పక్షాలకు మంచి విషయంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మొండివైఖరిపై చంద్రబాబు ధ్వజమెత్తుతున్నారు.

    అన్ని రాష్ర్టాలు ప్రత్యేకంగా తీసుకుంటుంటే ఏపీ మాత్రం పట్టించుకోవడం లేదని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని దుయ్యబడుతున్నారు. రాష్ర్టం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెబుతున్నారు. ఎవరైనా మాట్లాడితే దాడులు చేస్తున్నారని అన్నారు. తప్పుడు కేసులు పెడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

    టీకా కోసం రూ.1500 కోట్లు ఖర్చుకు తాము సిద్ధమని అవసరమైతే మరింత ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం వ్యాక్సినేషన్ కు రూ.500 కోట్లు కేటాయింపులే చేస్తే బాబు సరైన పాయంట్ పట్టుకున్నట్లు అవుతుంది. బాబు చెప్పినట్లుగా బడ్జెట్ లో వ్యాక్సినేషన్ కు రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారా? అన్న దానిపై ఏపీ సర్కారు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.