మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఫై ఇప్పటికే అనేక రకాలుగా పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే, తాజాగా ‘ఆచార్య’ సినిమా పై దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ‘ఆచార్య అనేది చరణ్ కథ అని, సినిమాలో మెయిన్ పార్ట్ చరణ్ దే అని, ఇక సినిమా నిడివి విషయానికొస్తే.. చరణ్ సెకండాఫ్ లో ఎక్కువ భాగం ఉంటాడని, ఇక బయట రూమర్స్ వస్తున్నట్టు ఈ సినిమాలో చిరంజీవి-చరణ్ తండ్రికొడుకులు కాదని’ తాజాగా కొరటాల శివ స్పష్టం చేశాడు.
ఇక ఆచార్య సినిమా మార్కెట్ పై కూడా ఇప్పటికే చాలా రకాలుగా లెక్కల లిస్ట్ ను చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా సీడెడ్ రైట్స్ దాదాపు 51 కోట్లు వరకు పలుకుతుందని, అలాగే నైజాం ఏరియాను 42 కోట్లకు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను హక్కులను చేజిక్కించుకున్నాడని.. పైగా ఈ సినిమాకి హిందీ మార్కెట్ తో సంబంధం లేకుండానే సుమారు 200 కోట్లు వచ్చే అవకాశం ఉందని ఆ వార్తల సారాంశం.
మొత్తానికి ఈ సినిమాలో రామ్ చరణ్ నటించడంతో ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అయిపోయింది. ఎలాగూ ‘సైరా’తో మెగాస్టార్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. మరి, ఇప్పుడు ఆచార్యకి చిరు స్టార్ డమ్ తో పాటు చరణ్ ఇమేజ్ కూడా బాగా ప్లస్ కానుంది. ఇక టాల్ బ్యూటీ పూజా హెగ్డే కూడా ఈ సినిమాలో చరణ్ కి హీరోయిన్ గా నటిస్తుండటం, పూజాకి బాలీవుడ్ లో హీరోయిన్ ఇమేజ్ ఉండటం కూడా ఈ సినిమాకి కలిసి రానుంది.
ఏ రకంగా చూసుకున్నా మెగాస్టార్ – కొరటాల కలయికలో రాబోతున్న ఈ పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ కి భారీ కలెక్షన్స్ రానున్నాయి. అందుకే, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమా కోసం భారీ ఖర్చు పెడుతున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.