‘విశాఖ ఉక్కు’పై స్పందించిన చంద్రబాబు.. ప్రధాని మోదీకి లేఖ..

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయమై.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు స్పందించారు. పరిశ్రమ ప్రయివేటీకరణ విషయమై మరోసారి పునర్ ఆలోచన చేయాలని అందులో కోరారు. స్టీల్ ప్లాంటును ప్రయివేటీక రించొద్దని.. అయిదు దశాబ్దాలకు పైగా.. తెలుగువారితో ముడిపడున్న ప్లాంటుకోసం ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో త్యాగం చేశారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పరిశ్రమ ఆవిర్భవించిందని , కంపెనీని ప్రయివేటీకరణ చేయడం కన్నా.. లాభాల్లోకి తెచ్చేలా మర్గాలు అన్వేషించాలని సూచించారు. Also Read: […]

Written By: Srinivas, Updated On : February 21, 2021 11:54 am
Follow us on


విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయమై.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు స్పందించారు. పరిశ్రమ ప్రయివేటీకరణ విషయమై మరోసారి పునర్ ఆలోచన చేయాలని అందులో కోరారు. స్టీల్ ప్లాంటును ప్రయివేటీక రించొద్దని.. అయిదు దశాబ్దాలకు పైగా.. తెలుగువారితో ముడిపడున్న ప్లాంటుకోసం ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో త్యాగం చేశారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పరిశ్రమ ఆవిర్భవించిందని , కంపెనీని ప్రయివేటీకరణ చేయడం కన్నా.. లాభాల్లోకి తెచ్చేలా మర్గాలు అన్వేషించాలని సూచించారు.

Also Read: రేపే నాలుగోవిడత.. గుంటూరులో ఏరులై పారుతున్న మద్యం, డబ్బు

కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరణ చేస్తామని ప్రకటించిన చాలా రోజుల తరువాత చంద్రబాబు స్పందించడం ఇప్పుడు ప్రధాన్యత సంతరించుకుంది. ఉక్కు ఉద్యమంపై కేంద్రానికి లేఖ రాయడానికి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడని అధికార వైసీపీ పార్టీ చేసిన విమర్శలకు సమాధానం ఇస్తున్నట్లు.. చంద్రబాబు నాయుడు రాసిన లేఖ ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖ స్టీల్ ఉత్తరాంధ్రకు జీవనాడిగా చంద్రబాబు లేఖలో అభివర్ణించారు. దాన్ని సాధించే పోరాటంలో ఎందరో అమరులయ్యారని తెలిపారు. 68 గ్రామాలకు చెందిన 16వేల కుటుంబాలు 26వేల ఎకరాలను స్టీల్ ప్లాంటు నిర్మాణం కోసం త్యాగం చేశారని.. ఆ త్యాగాల పునాదులపై నిర్మాణం అయిన ఈ ప్లాంటు.. దేశానికే గర్వకారణం అన్నారు.

Also Read: ఈ మాత్రం దానికి ఉద్యోగ సంఘాలతో భేటీ ఎందుకో..?

ఇంతకు ముందు కూడా పరిశ్రమ నష్టాల్లో నడిచిందని.. దాన్ని లాభాల బాట పట్టించేందుకు అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి చంద్రబాబు లేఖలో రాశారు. కేంద్రం 1333 కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఆర్థికంగా ఆదుకుందని.. ఫలితంగా మళ్లీ లాభాల్లోకి సంస్థ వచ్చిందని తెలిపారు. సొంత గనులు లేకనే స్టీల్ ప్లాంటు నష్టాల్లోకి వెళ్లిందని తెలిపారు. స్టీల్ ప్లాంటు భూములు రెండు లక్షల కోట్లు విలువ చేస్తాయని.. దాన్ని ప్రయివేటీకరణ చేయకుండా పునర్ ఆలోచన చేయాలని తెలిపారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

విశాఖ ఉక్కు తొలిదశ ఉద్యమంలో 66 మంది ఎమ్మెల్యేలు.. ఏడుగురు ఎంపీలు.. తమ పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. 1991 నుంచి 2000 మధ్యకాలంలో విశాఖ స్టీల్ ప్లాంటు రూ.4000 కోట్ల నష్టాన్ని చవి చూసిందని.. అప్పటి ప్రధాని వాజ్ పేయి హయాంలో దాన్ని బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రీయల్ అండ్ పైనాన్సియల్ రీకన్స్ట్రక్షన్ కు రెఫర్ చేసిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం వినతితో ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి కేంద్రం ఆదుకుందని తెలిపారు.