https://oktelugu.com/

హై కోర్టు స్టే పై సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం..!

రాజధాని తరలింపు విషయంలో రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్సెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు, రాజధాని తరలింపునకు సంబంధించి హై కోర్టులో దాఖలైన పలు పిటీషన్ లపై ఈ నెల 4వ తేదీన విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు పది రోజుల సమయం కావాలని న్యాయవాధి కోరారు. Also Read: బాబు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 8, 2020 1:14 pm
    Follow us on

    Supreme Court
    రాజధాని తరలింపు విషయంలో రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్సెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు, రాజధాని తరలింపునకు సంబంధించి హై కోర్టులో దాఖలైన పలు పిటీషన్ లపై ఈ నెల 4వ తేదీన విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు పది రోజుల సమయం కావాలని న్యాయవాధి కోరారు.

    Also Read: బాబు ప్రెస్ మీటా..? టీడీపీ నేతల పరుగో పరుగు?

    దీంతో 14వ తేదీ వరకూ గడువు ఇచ్చని హై కోర్టు ధర్మాసనం, రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లుల గెజిట్ ప్రటకన విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం విధితమే.కేసు విచారణ సందర్భంగా హై కోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిర్మాణంలో ఉన్న రాజధానిని మధ్యలో వదిలేసి మరొ ప్రాంతానికి వెళ్లడం వల్ల ప్రజా ధనం వృదా అవుతుందని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

    హై కోర్టు వాఖ్యలను బట్టీ చూస్తే ఈ వ్యవహారం ఇప్పట్టో తేలేదిగా కనిపించడం లేదు. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకూ ఖర్చు చేసిన నిధుల వివరాలు ఇవ్వాలని సీఆర్డీఏను హై కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, హై పవర్ కమిటీ వంటి అంశాలకు సంబంధించి ఇప్పటి వరకూ మొత్తం 35 పిటీషన్ ల వరకూ హై కోర్టులో దాఖలయ్యాయి. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ సంతకంతో చట్టపరంగా చిక్కులను అదిగమించినా హై కోర్టు స్టే వల్ల రాజధాని తరలింపు విషయంలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

    Also Read: ఫలించని బాబు వ్యూహం..!

    దీంతో హై కోర్టు స్టే నుంచి విముక్తి పొందాలని భావిస్తున్న ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సోమవారం విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో నిమ్మగడ్డ కేసులో హై కోర్టులో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేయగా, సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. నిమ్మగడ్ద దాఖలు చేసిన కోర్టు దిక్కార కేసుపైన స్టే ఇవ్వాలంటూ సుప్రీంలో ప్రభుత్వం పిటీషన్ వేసింది. అప్పడూ సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించింది. రాజధాని తరలింపు కేసులో హై కోర్టు ఇచ్చిన స్టే విషయంలో సుప్రీం కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.