Chandrababu Naidu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత ఆసక్తికరంగా మారాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగా 2023 వ సంవత్సరం లోనే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండడం తో రాష్ట్రము లో ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పటి నుండి వ్యూహాత్మకంగా అడుగుగులు వేస్తున్నాయి..అధికార వైసీపీ పార్టీ పై ప్రజల్లో రోజు రోజుకి పెరిగిపోతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని..యాంటీ వోట్ బాంక్ ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ మరియు జనసేన పార్టీలు సిద్ధం అవుతున్నాయి..పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాయదు భరోసా యాత్ర క్రింద ఆత్మహత్య చేసుకొని చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు 30 కోట్ల రూపాయిలు సహాయం చేసాడు..ఇక ఈ దసరా నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యాత్ర చేయనున్నాడు..దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభం అయిపోయాయి..మరోపక్క టీడీపీ నుండి నారా లోకేష్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు..ఇలా రాజకీయ పార్టీలన్నీ ఎవరి వ్యూహాన్ని వారు వేసుకోవడం ప్రారంభం అయిపోయింది.
అయితే ఇప్పుడు రాష్ట్రం లో ప్రధానం గా సాగుతున్న చర్చ టీడీపీ – జనసేన పార్టీల పొత్తు గురించి..జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు భారీ బహిరంగ సభ పెట్టిన పవన్ కళ్యాణ్..భవిష్యత్తులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబోము అని చెప్పిన ఒక మాట రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది..ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ లో గుబులు మొదలుకుంది..తెలుగు దేశం పార్టీ గత ఎన్నికలలో ఓడిపోయింది 7 శాతం వోట్ బ్యాంకు గ్యాప్ వల్లే..ఈ 7 శాతం వోట్ బ్యాంకు జనసేన పార్టీ కైవసం చేసుకుంది..ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిస్తే కచ్చితంగా రాబొయ్యే ఎన్నికలలో ఈ కూటమి కి అధికారం వచ్చే అవకాశాలే ఎక్కువ..కానీ పవన్ కళ్యాణ్ తానూ ముఖ్యమంత్రి అభ్యర్థిని అయితేనే పొత్తుకు అంగీకరిస్తాము అని అధికారికంగా ప్రకటించడం తో టీడీపీ పార్టీ అయ్యోమయ్యం లో పడింది..అయితే ఇప్పుడు చంద్ర బాబు నాయుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక్క వార్త తెగ హల్చల్ చేస్తుంది..అదేమిటి అంటే చంద్ర బాబు నాయుడు రొటేషన్ పద్దతి లో అధికారం ని షేర్ చేసుకోవడానికి అయితే పొత్తుకు సిద్ధం అని తెలుస్తుంది..అంటే రెండున్నర ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే..మరో రెండున్నర ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అన్నమాట..ఈ విషయం పై త్వరలోనే పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి పొత్తు గురించి అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది..మరి ఇందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.
Also Read: Maharashtra Political Crisis: మహారాష్ట్ర ఫిరాయింపుల సంక్షోభం.. పార్టీలకు ఒక గుణపాఠం